Bandi Sanjay Speech At Vijay Sankalp Sabha: తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు.
KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.
Etela Rajender Vs Revanth Reddy: కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏడ్వటంలో తప్పులేదని.. నిజంగా బాధ ఉంటేనే ఏడుపు వస్తుందన్నారు.
Revanth Reddy To Etela Rajender: “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్‌తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా... మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
Bandi Sanjay : చేవెల్లలో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభ సంచలన కావాలని బండి సంజయ్ అన్నారు. లక్షకు పైగా కార్యకర్తలు హాజరవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నేతలందరితోనూ బండి సంజయ్ సమీక్షలు జరిపారు.
Amit Shah Meeting In Chevella: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్‌ను సూపర్ సక్సెస్ చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు బండి సంజయ్. చేవెళ్ల సభకు భారీ జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు.
Karimnagar Hasanparthy Railway Line: కరీంనగర –హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి కేంద్ర నుంచి ఆమోదం లభించింది. వెంటనే రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయని తెలిపారు బండి సంజయ్.
Bandi Sanjay Write Letter To CM KCR: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. నిర్మల్ పట్టణంలో ఈద్గా నిర్మాణం కోసం భూమి కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా భూమి కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. హిందూ ఆలయాలకు సమీపంలో ఈద్గా ప్రార్థనలకు భూమి కేటాయించడం సరికాదన్నారు.
10th Class Papaer Leak 2023: A petition was filed to cancel the bail of Bandi Sanjay. పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ1గా ఉన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది.
BJP Rally: ఉద్యమాల గడ్డ ఓరుగల్లుల్లో చేపట్టిన నిరుద్యోగ మార్చ్ కు భారీ స్పందన లభిస్తోంది. మార్చ్ కు మద్దతుగా పెద్దఎత్తున విద్యార్దులు తరలివస్తున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. ఓరుగల్లు పొలికేకతో కేసీఆర్ పతనం తప్పదని హెచ్చరించారు.
Warangal: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ సందర్భంగా సీపీ రంగనాథ్ కార్యాలయం, సీపీ రంగనాథ్ కు భారీ భద్రత కల్పించారు. నిరుద్యోగ మార్చ్ సీపీ ఆఫీసు మీదుగా సాగనుండటంతో ఏ విధమైన అవాంఛనీయ సంఘనటలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు.
Bandi Sanjay Paid Tributes to Dr BR Ambedkar: డా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
CP Ranganath : టెన్త్ పేపర్ లీకేజ్ ఇష్యూ, బండి సంజయ్ అరెస్ట్ తరువాత వరంగల్ సీపీ రంగనాథ్ మీద ప్రత్యేక నివేదిక తయారు చేయించినట్టుగా తెలుస్తోంది. కేంద్రం అతని మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Paper leak Case : టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ ఇష్యూలో అరెస్ట్ అయిన ప్రశాంత్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే తనను అరెస్ట్ చేశారని ఆరోపించాడు.
Bandi Sanjay comments on Warangal CP: బలగం మూవీని థియేటర్లో వీక్షించారు బండి సంజయ్. సినిమాను ఎంతో చక్కగా తీసిని డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు, చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్‌కు మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాల్లేవంటూ విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.