Election commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ని పర్యటిస్తున్న ఆయన..ఏకగ్రీవాలపై స్పందించారు.
RTI Ex Commissioner: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు అధికమౌతున్నాయి. ఆయన చర్యలు ప్రమాదకరంగా మారాయని ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
AP SEC Nimmagadda Ramesh Kumar Voter Application Rejected: ఏపీలో పంచాయతీ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఓటర్ ఐడీ దరఖాస్తును గతంలో అధికారులు తిరస్కరించారు.
Privilege notices : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు నిమ్మగడ్డపై సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. నిమ్మగడ్డ పరిధి దాటుతున్నారనేది నోటీసుల సారాంశం..
Ap Government versus Nimmagadda: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా..ప్రభుత్వం ఆయనపై సీరియస్‌గా ఉందా. ఎన్నికల అనంతరం పరిస్థితి ఏంటి..నిమ్మగడ్డపై ప్రభుత్వం సీరియస్ అవడానికి కారణమేంటి..
AP SEC Proceedings: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీకు చెందిన ఇద్దరు కీలక అధికార్లపై నిమ్మగడ్డ జారీ చేసిన సెన్సూర్ ఆర్డర్‌ను ప్రభుత్వం తిప్పి పంపింది. ఈసీకు ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
Local Body Elections issue: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల విషయంలో వివాదాన్ని రేపిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి ఆజ్యం పోయడానికి సిద్ధమౌతున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించనున్నారని సమాచారం.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్ని నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో వాదన కొనసాగింది.
ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విమర్శల ధాటి పెరుగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
ఏపీలో వార్ ప్రారంభమైపోయింది. ప్రభుత్వంతో పేచీకి దిగడం మానడం లేదు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ ఉత్తర్వులతో సై అంటే సై అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల పంచాయితీ మళ్లీ కోర్టుకెక్కింది. ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ..ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
AP Local body elections Schedule 2021: అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక ఎన్నికలకు..కేంద్రానికి సంబంధమేంటి..
AP: ఎన్నికల కమీషన్, ప్రభుత్వం మధ్య నడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తలపెట్టగా..సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో వివాదం మొదలైంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కొన్నిపార్టీలు..తాజా నోటిఫికేషన్ ఉండాలని బీజేపీ, బీఎస్పీలు స్పష్టం చేయగా..ఎన్నికలకు సిద్ధమని టీడీపీ ప్రకటించింది.
ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar)ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగింపు వ్యవహారం అనేది ఒక విధానపరమైన నిర్ణయమని.. దానిని రాద్దాంతం చేసి రాజకీయం చేయడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అంబటి విస్మయం వ్యక్తంచేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఓ ఆర్డినెన్సుని తీసుకురాగా.. ఆ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి ఆమోదం సైతం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.