Local Body Elections issue: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నిమ్మగడ్డ, మరో వివాదమా..

Local Body Elections issue: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల విషయంలో వివాదాన్ని రేపిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి ఆజ్యం పోయడానికి సిద్ధమౌతున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించనున్నారని సమాచారం.

Last Updated : Jan 27, 2021, 11:52 AM IST
  • ఏపీ ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ మధ్య మరో వివాదానికి అవకాశాలు
  • పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు నిమ్మగడ్డ సన్నాహాలు
  • ఈసారి కూడా ప్రభుత్వంతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకునే దిశగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్
Local Body Elections issue: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నిమ్మగడ్డ, మరో వివాదమా..

Local Body Elections issue: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల విషయంలో వివాదాన్ని రేపిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి ఆజ్యం పోయడానికి సిద్ధమౌతున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించనున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఎన్నికల కమీషనర్  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) వర్సెస్ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏ స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేశారో..అవే ఎన్నికల్ని ప్రభుత్వంతో సంప్రదించకుండానే నిర్వహించేందుకు సిద్దపడుతున్నట్టు సమాచారం. పంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డకు, రాష్ట్ర ప్రభుత్వాని ( Ap Government ) కి మధ్య వివాదం కోర్టుకు చేరింది. చివరికి సుప్రీంకోర్టు ( Supreme court ) ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 

పంచాయితీ ఎన్నికల వివాదం ( Panchayat Elections Dispute ) సద్దుమణిగిందనుకునేలోగా..మరో వివాదం రేగే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్ధపడుతున్నారు. పంచాయితీ ఎన్నికలు ముగిసిన మరునాడే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 22న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ( Local Body Elections Notification ) వెలువరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈసారి కూడా ప్రభుత్వాన్ని సంప్రదించుకుండానే సన్నాహాలు చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ నిమ్మగడ్డ నిజంగానే ఫిబ్రవరి 22న నోటిఫికేష్ విడుదల చేస్తే ఈసారి కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించడం ఖాయం. లేదా ఎన్నికల కమీషనర్ కు వ్యతిరేకంగా కఠిన చర్యలైనా తీసుకోవచ్చు. 

Also read: Ap Panchayat Elections 2021: పంచాయితీల్ని ఏకగ్రీవం చేస్తే భారీ ప్రోత్సాహకాలు..ఊహించలేనంత డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News