ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్ని నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో వాదన కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap Local Body Elections ) విషయంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh Kumar ) కు, ప్రభుత్వానికి మధ్య వివాదం తెలిసిందే. ప్రభుత్వ సూచనల్ని, అభ్యంతరాల్ని కాదని ఏకపక్షంగా పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule ) విడుదల చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. పంచాయితీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ( High court ) సింగిల్ బెంచ్ ప్రభుత్వ వాదనతో ఏకీభవించి..ఎన్నికల్ని నిలిపివేసింది.
అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్..హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేశారు. సంక్రాంతి సెలవులకు ముందే దీన్ని విచారించాల్సిందిగా కోరినప్పటికీ..అంత అత్యవసరం లేదని భావించిన కోర్టు ఇవాళ్టికి అంటే జనవరి 18కు విచారణ వాయిదా వేసింది. ఇవాళ ఈ పిటీషన్‌పై వాదన జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ( Ap Advocate General Sriram ) వాదన విన్పించారు.
రాష్ట్ర ఎన్నికల కమీషన్ దాఖలు చేసిన పిటీషన్ ( Sec Rit Petition ) విచారణకు ఆమోదయోగ్యంగా లేదని..కోర్టుకు విన్నవించారు. ఛీఫ్ సెక్రటరీ, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖల్ని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar ) పట్టించుకోలేదని..ఏకపక్షంగా వ్యవహరించారని ఏజీ శ్రీరామ్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ గురించి హైకోర్టు ( Ap High Court ) కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు.
Also read: NTR Vardhanthi: ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర..ఇదే సాక్ష్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook