AP: కేంద్రమే ప్రతివాది ఇక..విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో  మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక ఎన్నికలకు..కేంద్రానికి సంబంధమేంటి..

Last Updated : Dec 19, 2020, 01:31 PM IST
  • కరోనా వ్యాక్సిన్ 2-3 నెలల్లో వస్తుందంటే ఎన్నికల కమీషన్ నమ్మడం లేదు..
  • అందుకే కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తామని హైకోర్టుకు స్పష్టం చేసిన ప్రభుత్వం
  • అంగీకరించిన హైకోర్టు..విచారణ 22వ తేదీకు వాయిదా
AP: కేంద్రమే ప్రతివాది ఇక..విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో  మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక ఎన్నికలకు..కేంద్రానికి సంబంధమేంటి..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body elections ) పంచాయితీ ఇప్పుడు హైకోర్టు విచారణలో ఉంది. ఈ కేసు విచారణ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమీషన్ అక్టోబర్ 17న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ( Ap government ) హైకోర్టును ( High court ) ఆశ్రయించింది. కోవిడ్ వ్యాక్సిన్ (Covid19 vaccine ) మరో 2-3 నెలల్లో రానుందని..వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాల్ని జారీ చేసిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని అమలు చేసే ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని..ఫిబ్రవరిలో ఎన్నికలు వద్దనేందుకు తాము చెబుతున్న కారణాలు తీవ్రమైనవని ప్రభుత్వం వాదిస్తోంది. 

Also read: AP Cabinet Meeting Key Decisions: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..

అయినా సరే అసలు కరోనా వ్యాక్సిన్ వస్తుందనే విషయాన్ని ఎన్నికల కమీషన్ నమ్మడం లేనందున..కేంద్రం చెబితేనే బాగుంటుందని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కేసులో ప్రతివాదిగా చేరుస్తామని ప్రభుత్వం కోరింది. మరోవైపు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేయాలని కోరగా..హైకోర్టు అంగీకరించింది.

మరోవైపు ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar ) కోర్టు ధిక్కరణ కేసు ( Contempt of court ) దాఖలు చేశారు. విధుల నిర్వహణలో తనకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పాటించడం లేదనేది నిమ్మగడ్డ వాదన. ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరుల్ని కోర్టు ధిక్కారణ నేరం కింద శిక్షించాలని నిమ్మగడ్డ హైకోర్టును కోరారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు పూర్తి సహాయ, సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. Also read: AP: మూడు నెలల విద్యుత్ ఛార్జీలు రద్దు..వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు

Trending News