AP ఎన్నికల కమిషనర్‌గా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు

ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.

Last Updated : Aug 3, 2020, 02:27 PM IST
AP ఎన్నికల కమిషనర్‌గా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని చివరికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ((Nimmagadda Ramesh) మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని కార్యాలయంలో పని ప్రారంభించినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అన్నారు. పార్టీలు, నేతలు, రాగద్వేషాలకు అతీతంగా ఈసీ వ్యవహరిస్తుందన్నారు. విధుల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నానంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితి.. ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీగా మారింది. అనంతరం ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను బాధ్యతల నుంచి తప్పించింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 

కాగా, నిమ్మగడ్డనే ఎస్‌ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించిన ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. తనను ఎస్ఈసీగా నియమించకపోవడంతో రమేష్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. హైకోర్టు ధిక్కార పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం స్టే కోరిన పిటిషన్‌పై ఆయన సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడం తెలిసిందే. అందాల ‘దేశముదురు’ హన్సిక Photos 

Trending News