AP: ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం

AP: ఎన్నికల కమీషన్, ప్రభుత్వం మధ్య నడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తలపెట్టగా..సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో వివాదం మొదలైంది.

Last Updated : Dec 15, 2020, 06:44 PM IST
  • స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో విచారణ
  • కరోనా వ్యాక్సినేషన్ కారణంగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమంటూ ప్రభుత్వం అఫిడవిట్
  • కౌంటర్ దాఖలు చేస్తామన్న ఎన్నికల కమీషనర్
AP: ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం

AP: ఎన్నికల కమీషన్, ప్రభుత్వం మధ్య నడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తలపెట్టగా..సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో వివాదం మొదలైంది.

2020 మార్చ్ నెలలో ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Ap sec nimmagadda ramesh kumar ), ఏపీ ప్రభుత్వాలకు ( Ap government ) మధ్య ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పంచాయితీ హైకోర్టుకు చేరింది. 2021 ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికల్ని( local body elections ) నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తలపెట్టింది. కరోనా వైరస్ ( corona virus ) సంక్రమణ కారణంగా కుదరదంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా తాజాగా ఏపీ అసెంబ్లీ ( Ap Assembly )లో తీర్మానం కూడా చేసింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర హైకోర్టు ( Ap high court )లో దీనిపై విచారణ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని..ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించలేమంటూ ప్రభుత్వం అదనంగా అఫిడవిట్ దాఖలు చేసింది.

కరోనా వ్యాక్సినేషన్ కారణంగా..పోలీసులు, సిబ్బందిని కేటాయించలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణపై కౌంటర్ దాఖలు చేస్తామని ఎస్ఈసీ ( SEC ) తెలిపింది. విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ( Supreme court )ఆదేశాలకు విరుద్ధమని..కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వం హైకోర్టు ముందు వాదన విన్పించింది. గతంలో అంటే ఈ ఏడాది ఇదే కరోనా వైరస్ కారణంగా చూపించి ఎన్నికల్ని వాయిదా వేసిన కమీషన్..ఇప్పుడు ఎన్నికల్ని నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. Also read: AP: తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..ఎవరంటే..

Trending News