అమరావతి: నాటకీయ పరిణామాల మధ్య ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar)ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి విజయం సాధించి ఎన్నికల కమిషనర్‌గా రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar Appointed As AP State Election Commissioner) తిరిగి నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. IPL 2020: భారత ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూపులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేస్తూ మార్చి 15న నిర్ణయం తీసుకున్నారు. తమకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్ర ఎన్నికల నూతన కమిషనర్‌గా జస్టిస్ కనకరాజన్‌ను సైతం నియమించింది. తన పదవీకాలాన్ని కుదించేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేసి తననే ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి
రమేష్ కుమార్‌నే ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించిన ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనను ఎన్నికల కమిషనర్‌గా నియమించకపోవడంతో రమేష్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సంప్రదించాలన్న సూచన మేరకు ఆయనను కలిశారు. రమేష్ కుమార్‌నే పదవిలో కొనసాగించాలని గవర్నర్ చెప్పినా ఏపీ ప్రభుత్వం పాటించలేదు. హైకోర్టు ధిక్కార పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం స్టే కోరుతూ చేసిన అప్లికేషన్‌ను ఆయన సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే..