మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా ఘనంగా జరపాలని.. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి మహానాడు వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు భావించారట. కానీ కొరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి పరిణామాల కారణంగా అది బాబుకు కుదిరేలా లేదు. అందుకే తెలుగు తమ్ముళ్లు చేసేదేమిలేక వర్చువల్ మహానాడు నిర్వహించాలని ఓ నిర్ణయానికొచ్చారు.
టీటీడీ ఆస్తుల వేలంపై ( TTD lands auction ) ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పలు ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ( AP govt ) సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు ( IAS officers transfers in AP ) వెలువడ్డాయి. వీరిలో కొంతమంది ఐఏఎస్‌లకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు తోడు అదనంగా ఇంకొన్ని కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఏపీ సర్కార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్ ( Coronavirus ) అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపుపై (Liquor price hike in AP) టీడీపీ చేస్తోన్న విమర్శలపై స్పందించే క్రమంలో పార్ధసారథి ( MLA Parthasarathy ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కరోనావైరస్ కర్నూలు జిల్లాను వణికిస్తోంది. అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా (COVID-19 cases in Kurnool dist) మరో వుహాన్‌ని తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
కరోనావైరస్పై యావత్ దేశం కలిసి చేస్తోన్న యుద్ధంలో భాగంగా కరోనావైరస్ ప్రభావం తీవ్రత ఆధారంగా కేంద్రం మరోసారి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించింది. ఈ క్రమంలో ఏపీలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఐదు జిల్లాలను రెడ్ జోన్లుగా గుర్తించిన కేంద్రం.. మరో ఏడు జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. ఆయా జోన్స్ వివరాలిలా ఉన్నాయి.
తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రెడ్‌జోన్, కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్నవారిలో ఎవరికైనా శ్వాస అందక ఇబ్బుందులు పడినా, లేదా ఫ్లూ లాంటి కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే 104కు ఫోన్ చేయాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఏపీలో గత 24 గంటల్లో 6306 బ్లడ్ శాంపిల్స్‌కి కోవిడ్ పరీక్షలు జరపగా అందులో 62 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిందని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.
రంజాన్ మాసం (Ramzan month) సమీపిస్తోంది. ఏప్రిల్ 23, గురువారం నాడు ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసం మే 23, శనివారం నాడు ముగియనుంది. రంజాన్ మాసంలో (Ramadan month) సంప్రదాయం ప్రకారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరపడం ఒక ఆనవాయితీ.
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 3,775 శాంపిల్స్‌ని పరీక్షలు చేయగా.. అందులో 75 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.
ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి.
ఏపీలో బుధవారం కొత్తగా మరో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. కరోనా వైరస్ కారణంగా బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో శనివారం నాడు 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 405కు చేరుకుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు నమోదైన 24 కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక భాగం గుంటూరు జిల్లాలోనే వెలుగుచూడటం గమనార్హం.
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఓ ఆర్డినెన్సుని తీసుకురాగా.. ఆ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి ఆమోదం సైతం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.