Coronavirus in AP: ఏపీలో కొత్తగా 23 కరోనా కేసులు, ముగ్గురు మృతి!

ఏపీలో బుధవారం కొత్త‌గా మ‌రో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం క‌రోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. కరోనా వైరస్ కారణంగా బుధవారం నాడు ముగ్గ‌ురు మృతి చెందారు.

Last Updated : Apr 16, 2020, 01:16 AM IST
Coronavirus in AP: ఏపీలో కొత్తగా 23 కరోనా కేసులు, ముగ్గురు మృతి!

అమరావతి: ఏపీలో బుధవారం కొత్త‌గా మ‌రో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం క‌రోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. బుధవారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 14కు చేరింది. మరోవైపు న‌లుగురు కరోనావైరస్ రోగులు వ్యాధి నయమవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు 20 మంది క‌రోనావైరస్ నుంచి కోల‌ుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆస్పత్రులలో 491 మంది కరోనావైరస్ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. 

Also read: Telangana updates: తెలంగాణలో 650కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో ఇప్పటివరకు 11,613 మంది అనుమానితుల శాంపిల్స్‌ని పరీక్షించగా.. 11,088 మందికి కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1401 మందికి పరీక్ష జరపగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 242 మందికి మాత్రమే కరోనా పరీక్షలు జరిపారు. 

Also read : Tablighi Jamaat Markaz: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు

ఏపీలో జిల్లాల వారీగా ఏయే జిల్లాలో అత్యధికంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల నమోదయ్యాయనే విషయానికొస్తే... గుంటూరు జిల్లాలో అత్య‌ధికంగా 122 మంది, కర్నూలు జిల్లాలో 110 మంది, నెల్లూరు జిల్లాలో 58 మంది, కృష్ణా జిల్లాలో 45 మంది, ప్రకాశం జిల్లాలో 42 మంది, క‌డ‌ప జిల్లాలో 36 మంది, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 31 మంది, చిత్తూరు జిల్లాలో 23 మంది, అనంత‌పురంలో 21, విశాఖ‌లో 20, తూర్పు గోదావ‌రిలో 17 మంది ఉన్నారు. అదృష్టవశాత్తుగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ రెండు జిల్లాల విషయంలో సర్కార్‌కి, అక్కడి అధికారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. అయితే, ఆ రెండు జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను సర్కార్ తీసుకుంటోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News