ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్స్ జోన్స్ వివరాలు

కరోనావైరస్‌పై యావత్ దేశం కలిసి చేస్తోన్న యుద్ధంలో భాగంగా కరోనావైరస్ ప్రభావం తీవ్రత ఆధారంగా కేంద్రం మరోసారి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించింది. ఈ క్రమంలో ఏపీలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఐదు జిల్లాలను రెడ్‌ జోన్లుగా గుర్తించిన కేంద్రం.. మరో ఏడు జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. ఆయా జోన్స్ వివరాలిలా ఉన్నాయి. 

Last Updated : May 3, 2020, 02:30 AM IST

అమరావతి: కరోనావైరస్‌పై యావత్ దేశం కలిసి చేస్తోన్న యుద్ధంలో భాగంగా కరోనావైరస్ ప్రభావం తీవ్రత ఆధారంగా కేంద్రం మరోసారి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించింది. ఈ క్రమంలో ఏపీలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఐదు జిల్లాలు అయిన కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను రెడ్‌ జోన్లుగా గుర్తించిన కేంద్రం.. మరో ఏడు జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. ఇక ఇప్పటివరకు ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదుకాని విజయనగరం జిల్లాను కేంద్రం గ్రీన్‌ జోన్‌గా పేర్కొంది. 

Also read : కంటైన్మెంట్ జోన్ అంటే ఏమిటి, వాటిని ఎలా వర్గీకరిస్తారు?

కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, గ్రీన్ జోన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
రెడ్‌ జోన్‌: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు.
ఆరెంజ్‌ జోన్‌: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం.
గ్రీన్‌ జోన్‌: విజయనగరం.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News