అమరావతి: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా లాక్‌డౌన్ సడలింపునకు సంబంధించి ఏపీ సర్కార్ బుధవారం అదనంగా ఇంకొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతకంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాక్ డౌన్‌పై సడలింపునకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
Also read: ఏపీలో తాజాగా 73 మందికి కరోనా.. 3 జిల్లాల్లో భారీగా కేసులు
కొత్తగా విడుదలైన మార్గదర్శకాలు ప్రకారం ఎవరెవరికి మినహాయింపులు ఉన్నాయంటే..
వ్యవసాయ రంగం, ఉద్యానవనం పంటలకు సంబంధించిన పనులకు అనుమతి.
పంటల కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌తో పాటు ప్లాంటేషన్ పనులుకు అనుమతి మంజారు.
షాపింగ్ మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాల్లో రద్దీగా లేని చోట దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి.
రాష్ట్రం పరిధిలోని వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లి పనులు చేసుకునేందుకు అనుమతి (కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే).
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణరంగం, పవర్ లైన్స్ కాంట్రాక్ట్, టెలికాం కేబుల్స్ పనులకు మినహాయింపు.
ఈ కామర్స్ కంపెనీలకు సేవలు ( సిబ్బంది వాహనాలకు అనుమతి పాస్‌లు తప్పనిసరి).
బుక్స్ షాపులు (స్టేషనరి) మినహాయింపు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..