Andhra pradesh: కోవిడ్ పరీక్షల్లో ఏపీ టాప్: జవహార్ రెడ్డి

ఏపీలో గత 24 గంటల్లో 6306 బ్లడ్ శాంపిల్స్‌కి కోవిడ్ పరీక్షలు జరపగా అందులో 62 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌ అని నిర్దారణ అయిందని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.

Last Updated : Apr 24, 2020, 11:55 PM IST
Andhra pradesh: కోవిడ్ పరీక్షల్లో ఏపీ టాప్: జవహార్ రెడ్డి

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ అప్‌డేట్స్ విషయానికొస్తే...  గత 24 గంటల్లో 6306 బ్లడ్ శాంపిల్స్‌కి కోవిడ్ పరీక్షలు జరపగా అందులో 62 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌ అని నిర్దారణ అయిందని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. మొత్తం ఇప్పటికే 54 వేల పై చిలుకు కోవిడ్ టెస్టులు చేశాం. ప్రతీ మిలియన్ మంది ప్రజలకు నిర్వహించిన టెస్టుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రతీ పది లక్షల మంది జనాభాకుగాను 1,018 మందికి పరీక్షలు నిర్వహించాం. గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, కృష్ణా జిల్లా, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,577 టెస్టులు నిర్వహించామని జవహార్ రెడ్డి తెలిపారు.

Also read : అర్నాబ్ గోస్వామిపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు

గత 24 గంటల్లో ప్రస్తుత క్లస్టర్లలొనే 40 కేసుల వరకు వచ్చాయి. కొత్తగా 7 మండలాలు కరోనా కారణంగా క్లస్టర్ల జాబితాలోకి చేర్చాం. టెలి మెడిసిన్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇంటికే మందులు సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం. వైరస్ వ్యాప్తి కారణంగా డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూశాఖ సిబ్బందికి కొన్ని చోట్ల కరోనా వైరస్ సోకింది.

Also read : ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి

పలు చోట్ల ర్యాలీలు చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. ఇలాంటివాటిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడి ఉన్నందున వాటిపై మరోమారు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News