Flash news: ఇంగ్లీష్ మీడియంకే ఓటేసిన 96% మంది విద్యార్థుల తల్లిదండ్రులు

తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.

Last Updated : May 1, 2020, 10:49 AM IST
Flash news: ఇంగ్లీష్ మీడియంకే ఓటేసిన 96% మంది విద్యార్థుల తల్లిదండ్రులు

అమరావతి: తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీ (TDP) మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రవేశపెట్టే ఇంగ్లీష్ మీడియం విద్యాభ్యాసం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు (Telugu medium students) ఇబ్బందిపడతారని ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. చివరకు ఈ విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. ఇదిలావుండగానే తాజాగా ఏపీలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. 

Also read : 10వ తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ వైఖరి ఇదే

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధననే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న ఏపీ సర్కార్ (AP govt) ఓ అధ్యయనం చేపట్టింది. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం బోధనకు ఎంతమంది మద్దతు ఇస్తారు ? ఎంత మంది వ్యతిరేకిస్తారో తెలుసుకోవాలనే లక్ష్యంతో జరిగిన ఈ సర్వేలో 96.17 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్యకే ఓటు వేశారని ఏపీ విద్యా శాఖ అధికారి ఒకరు తెలిపారు. 17 లక్షల 87 వేల 35 మంది తల్లిదండ్రులు పాల్గొన్న ఈ సర్వేలో 17 లక్షల 85 వేల 669 మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్యకే మద్దతు ఇచ్చినట్టు (Voted for English medium) సదరు అధికారి తెలిపారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నేరుగానే ఈ వివరాలు సేకరించారు.

Also read : కోవిడ్19 యాప్ లాంచ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇక వివరాలు మీ చేతుల్లో!

ఈ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా మూడు ఆప్షన్స్‌తో ఓ ప్రశ్నావలిని తయారు చేసినట్టు తెలుస్తోంది. అందులో మూడు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. 
1) ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధిస్తూ.. ఒక్క తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం. 
2) తెలుగు మీడియం భాషలోనే చదువు చెప్పడం. 
3) మరేదైనా ఇతర భాషలో విద్యాభ్యాసం. 

ఈ మూడు ఆప్షన్స్‌లో 96.17% మంది విద్యార్థుల తల్లిదండ్రులు మొదటి ఆప్షన్‌కే తమ ఓటు వేయగా 3.05% మంది రెండో ఆప్షన్‌ని, 0.78% మంది మూడో ఆప్షన్‌ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం విషయంలో పలు అభ్యంతరాలను ఎదుర్కొంటున్న ఏపీ సర్కార్‌కి ఈ అధ్యయనం ఫలితాలు ఒకింత బలాన్నివ్వనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News