తెలంగాణలో తగ్గినట్టే తగ్గిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య ( COVID-19 positive cases in Telangana ) మళ్లీ పెరుగుతోంది. గురువారం నాడు కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తన భర్త మధుసూదన్ ఆచూకీ కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వనస్థలిపురం మహిళకు.. ఆమె భర్త కరోనాతో మృతి చెందగా జీహెచ్ఎంసీ సిబ్బందే ( GHMC ) అంత్యక్రియలు పూర్తిచేశారని తెలిసిన విషయం నగరంలో ఎంత వివాదమైందో తెలిసిందే. భార్యకు కూడా చెప్పకుండానే భర్త శవానికి ఎలా అంత్యక్రియలు ( Cremation ) పూర్తి చేస్తారని మహిళ నిలదీసిన నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ( Minister Etela Rajender ) ఆ వివాదంపై స్పందించారు.
లాక్డౌన్ సడలింపుల ( Lockdown guidelines) అనంతరం కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. తెలంగాణలో మంగళవారం కొత్తగా 42 కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus positive cases ) గుర్తించగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోవి 34 కాగా.. వలస కార్మికులు 8 మంది ఉన్నారు.
తెలంగాణలో నేడు కొత్తగా 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో 15 కేసులు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో నమోదు కాగా మరో 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు.
తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్.. కంటైన్మెంట్ జోన్, గ్రీన్ జోన్ అని జోన్లతో సంబంధం లేకుండా కొన్ని రకాల సేవలు, వ్యాపారాలకు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సర్కార్ తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.
తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగతా అన్ని జోన్లను గ్రీన్ జోన్స్ గానే పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గ్రీన్ జోన్లలో సడలింపులు ఉన్నప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్డౌన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.
కరోనావైరస్పై యావత్ దేశం కలిసి చేస్తోన్న యుద్ధంలో భాగంగా కరోనావైరస్ ప్రభావం తీవ్రత ఆధారంగా కేంద్రం మరోసారి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించింది. ఈ క్రమంలో ఏపీలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఐదు జిల్లాలను రెడ్ జోన్లుగా గుర్తించిన కేంద్రం.. మరో ఏడు జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. ఆయా జోన్స్ వివరాలిలా ఉన్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రెడ్‌జోన్, కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్నవారిలో ఎవరికైనా శ్వాస అందక ఇబ్బుందులు పడినా, లేదా ఫ్లూ లాంటి కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే 104కు ఫోన్ చేయాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.