ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతలో కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా గురువారం 15 పాజిటివ్ కేసులు రావడం కొంత ఉపశమనాన్నిస్తోంది. మొదట్లో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటాన్ని పరిశీలిస్తే.. పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా బుధవారం వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో -13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో -49, కడప జిల్లో 28, కృష్ణా జిల్లాలో -35, కర్నూలు జిల్లాలో 75, నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి -22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు విషయంలో గత రెండు, మూడు రోజుల నుండి ఉన్న పరిస్థితితో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్ 7న మంగళవారం నాటి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు కనిపించింది.
లాక్ డౌన్ తర్వాత కూడా కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉన్న హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి అన్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు వాళ్ల సంబంధీకులకు కలిపి సుమారు 3,500 మంది శాంపిళ్లు సేకరించి కోవిడ్ పరీక్షలకు పంపించామని ఆయన తెలిపారు.
కరోనా వైరస్ నివారణ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి పలు సలహాలు, సూచనలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఓ లేఖ రాశారు.అప్పుడే దేశం కరోనావైరస్పై సమర్థవంతంగా పోరాడగలదని ఆమె స్పష్టంచేశారు.
ఏపీలో తాజాగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in AP) గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏపీ సర్కార్ ఓ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల వరకు కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ సర్కార్ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం తరహాలోనే బుధవారం ఏప్రిల్ 1 నాడు కూడా రాష్ట్రంలో మరో 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 111కు చేరింది.
ఏపీలో కరోనావైరస్ పెరగడం వెనుక ఏపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి ఉందని ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. లోకల్ ట్రాన్స్‌మిషన్‌ను నిరోధించకపోతే ఆ తర్వాత వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టం అవుతుందని అన్నారు.
కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సందర్భంగా మార్చి 11 వరకు నామినేషన్స్ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేడు మార్చి 12న నామినేషన్స్ పరిశీలన జరగనుండగా.. మార్చి 14వ తేదీ నామినేషన్స్ ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. ఈ నేపథ్యంలో 13 జిల్లాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల వివరాలను తాజాగా ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఏపీ సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ వినిపించింది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL) అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా తెలియజేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మార్చి 4 నుంచి 23 తేదీ వరకు 20 రోజుల పాటు ఇంటర్మీడియె పరీక్షలు జరుగుతాయని... ఈ పరీక్షల కోసం 1,411 పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయని అన్నారు.
రాజధాని అమరావతి రథ మహోత్సవంకు వెళ్లి వస్తుంటే కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని.. అది టీడీపి పెయిడ్ ఆర్టిస్టుల పనేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. జై అమరావతి.. జై చంద్రబాబు.. అంటూ తనపై దాడి చేయడమే కాకుండా తనను నోటికొచ్చినట్లుగా దూషించారని ఎంపీ సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఏపీ సర్కార్‌తో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బృందం సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో కూడా త్వరలోనే ఇదే విధమైన చట్టాన్ని రూపొందిస్తామని ఈ సందర్భంగా అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టంచేశారు.
నగరంలో అక్రమ నిర్మాణాలపై అవినీతి నిరోదక శాఖ ఉక్కుపాదం మోపుతోంది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో కలిసి ఇప్పటికే తనిఖీలు చేపట్టిన ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
తెల్ల రేషన్ కార్డుల రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు.. అర్హులను, అక్రమంగా రేషన్ తీసుకుంటున్నవారిని గుర్తించారని మంత్రి తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీలో జన్మించడమే దురదృష్టకరమని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.