సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అని అన్నారు.
CM Jagan: వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన గులాబ్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని అందజేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూ హక్కు పట్టాలు ఆగస్టు 9న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా.. కరోనా వ్యాప్తి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఇది ఏపీ అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. ఏపీ అగ్రస్థానంలో నిలవడం వెనుక అధికారుల కృషి ఎంతో ఉందని చంద్రబాబు మెచ్చుకున్నారు. టీడీపీ పరిపాలన మెరుగ్గా ఉందనడానికి తాజా పరిణమామమే నిదర్శనమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు మోడీ సర్కార్ పై మరోసారి ధ్వజమెత్తారు. ఏపీకి మోడీ సర్కార్ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం సాధికార మిత్రులతో ఏపీ సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తుందన్నారు. కేంద్రం విగ్రహానికి ఇచ్చిన విలువ కూడా 5 కోట్ల మంది తెలుగువాళ్లకు ఇవ్వడం లేదన్నారు. గుజరాత్ లో పటేల్ విగ్రహానికి రూ. 2 వేల 500 కోట్లు కేటాయించిన మోడీ సర్కార్.. నవ్యాంధ్ర రాజధాని కోసం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఒక్క విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత..
ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు కూర్చున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారు. ధర్మ పోరాటం పేరుతో చేస్తున్న చంద్రబాబు దీక్షకు పార్టీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు శివరామకృష్ణ చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతు ఆయన మెడలో పూలమాల వేసి ఆశీర్వదించారు. టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దసరా వేడుకల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తాతతో కలిసి పంచెకట్టుతో దేవాన్ష్ ఆలయానికి వచ్చాడు. పూజ సమయంలో దేవాన్ష్ తాత ఒడిలో కూర్చున్నాడు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మంచి పనిచేయాలన్న కొన్ని దుష్టశక్తులు అడ్డుతగులుతున్నాయని..వైసీపీ నుద్దేశించి పరోక్షంగా విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.