ప్రత్యేక హోదా పోరు: చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

Last Updated : Apr 20, 2018, 09:54 AM IST
ప్రత్యేక హోదా పోరు: చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు కూర్చున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారు. ధర్మ పోరాటం పేరుతో చేస్తున్న చంద్రబాబు దీక్షకు పార్టీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు శివరామకృష్ణ చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతు ఆయన మెడలో పూలమాల వేసి ఆశీర్వదించారు. టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు.

శుక్రవారం ఉదయం దీక్ష ప్రాగణం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ నేతలు,  కార్యకర్తలు మద్దుతు తెలిపారు. ఉదయం అశేష కార్యకర్తల మధ్య దీక్ష వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు.. పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ..’ పాటతో దీక్ష ప్రారంభమైంది. 

చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ దీక్షలు

కాగా చంద్రబాబు దీక్షకు మద్దుతుగా రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో మంత్రుల సంఘీభావ దీక్షలు చేస్తున్నారు. కాగా సాయంత్రం ఏడు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఆధ్రప్రదేశ్ రాస్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై సమర శంఖం పూరించి దీక్షకు దిగిన చంద్రబాబుకు  వివిధ రంగాల వారు మద్దుతు తెలుపుతున్నారు. చంద్రబాబు తన జన్మదినాన్ని పురస్కరించుకొని దీక్షకు దిగడం విశేషం. కాగా వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఇటువంటి  ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని అధికారులు రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

Trending News