చంద్రబాబు టెంపరరీ ..జగన్ పర్మినెంట్ - రోజా

జగన్ గృహ ప్రవేశం సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు

Last Updated : Feb 27, 2019, 10:49 AM IST
చంద్రబాబు టెంపరరీ ..జగన్ పర్మినెంట్ - రోజా

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు విరుచుకుపడ్డారు. ఈ ఉదయం అమరావతి ప్రాంతంలో జగన్ గృహ ప్రవేశ ఈ కార్యక్రమానికి వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణానికి జగన్ వ్యతిరేకమని టీడీపీ నేతల తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతిని వేరే చోటికి తరలిస్తారని టీడీపీ నేతలు చేస్తున్న  తప్పుడు ప్రచారం ఆపాలని హితవుపలికారు.

నవ్యాంధ్ర అమరావతిని వ్యతిరేకిస్తే జగన్ ఇక్కడ సొంత ఇల్లు, శాశ్వత పార్టీ కార్యాలయాన్ని ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండాలన్న చిత్తశుద్ధితోనే ఇది నిదర్శనమన్నారు. చంద్రబాబుకు ఏపీలో ఓటు లేదు... ఆఫీసు లేదు.. సొంతిల్లు లేదు. తాను ఓడిపోతానని తెలిసే చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. 

టెంపరరీ కట్టాడాలతో సరిపెడుతున్న చంద్రబాబు టెంపరరీ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ ఈ రాష్ట్రానికి  పర్మినెంట్ అవుతారని రోజా వ్యాఖ్యానించారు

Trending News