పుష్ప సినిమా కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో ఐదు షోలు వేయనున్నారు.
ఈరోజు ముంబైలో పుష్ప సినిమా కోసం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందరంగా హీరోయిన్ రష్మిక మందన్న సామి సామి అనే పాటకు డాన్స్ చేశారు. ఆమెతో పాటు యాంకర్ కూడా స్టెప్పులు వేశారు.
Allu Arjun about Pushpa movie: అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం సమీపించింది. పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ విడుదలకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో (Allu Arjun fans) పాటు అన్నివర్గాల ఆడియెన్స్ కూడా పుష్ప మూవీ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.
Pushpa Song Dispute: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా..లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పుష్ప సినిమాలో ఓ పాటపై మగవారికి కోపమొచ్చింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకెక్కారు. మగజాతిని అవమానించేదిగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Pushpa First Review: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీ పుష్ప రేపు ప్రపంచమంతా విడుదల కానుంది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్న నేపధ్యంలో ఫస్ట్ రివ్యూ ఆసక్తి రేపుతోంది.
Rashmika Mandanna dance video : బ్ల్యాక్ టీ షర్ట్‌లో షార్ట్ హాట్ ప్యాంట్‌తో రష్మిక మందన్నా పుష్ప మూవీలోని సామీ సామీ హిందీ సాంగ్‌కు స్టెప్స్ వేసింది. "చాలా మంది ఈ సామీ సామీ పాటకు రీల్స్ చేయడం నేను చూస్తూనే ఉన్నాను..అందుకే మీతో పాటు నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకున్నా. అందుకే ఈ వీడియో చేశాను.. ఇలా చాలా మంది వారి స్టెప్స్‌తో.. మా మాస్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను." అంటూ రష్మిక మందన్నా పోస్ట్ చేసింది.
పుష్ప సినిమాలో హీరోయిన్ సమంత ఐటెం నంబర్ వివాదాస్పదమవుతోంది. 'మీ మగ బుద్దే వంకర బుద్ధి' అనే ఐటెం సాంగ్ లిరిక్స్ పురుషుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురుష సంఘాలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు.. డైవిడ్ వార్నర్.. పుష్పా సాంగ్ వీడియోతో ఇన్‌స్టాలో సందడి చేశాడు. ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ సహా.. పలువురు క్రికెటర్లు ఫన్నిగా స్పందిస్తున్నారు.
Pushpa Movie Samanthas special song : మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసిన సమంత ఐటెం సాంగ్‌ని పుష్ప మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. లంగా జాకెట్ ధరించి, మాస్ లుక్‌తో అదిరిపోయింది సమంత. పాట మొత్తం మస్త్ మాస్‌గా సాగుతుంది. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అంటూ సాగే పాట అదిరిపోయింది.
Allu Arjun fan sensational comments on Pushpa Movie : అల్లు అర్జున్ ఫ్యాన్ రాజేశ్ బన్నీ అనే ట్విట్టర్ ఖాతాతో.. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.. "ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది.. పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారు." అంటూ అల్లుఅర్జున్ ఫ్యాన్ తాజాగా ట్వీట్ చేశాడు.
పుష్ప సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో దర్శకనిర్మాతలు సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా మందిని ఆకట్టుకున్నా.. కొంతమందికి మాత్రం నచ్చలేదట. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అల్లు అర్జున్ స్టామినా ఏంటే చెప్పేలా ఉన్న పుష్ప మూవీ ట్రైలర్ చూస్తుంటే.. అల్లు అర్జున్ అభిమానులకు (Allu Arjun's fans) మన హీరో తగ్గేదేలే అనిపించడం ఖాయం అనేలా ఉంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. పుష్ప: ది రైజ్ ట్రైలర్‌పై (Pushpa trailer Telugu) మీరూ ఓ లుక్కేయండి.
Pushpa Trailer launching date: పుష్ప ట్రైలర్ కోసం వేచిచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. డిసెంబర్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల కావాల్సి ఉన్న పుష్ప ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది.
Pushpa Trailer launching: అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పుష్ప మూవీ ట్రైలర్ విడుదలకు ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 17న పుష్ప మూవీ విడుదల కానుండటంతో అంతకంటే పది రోజులు ముందుగా పుష్ప ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది.
ఈ ఏడాది దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినీ నటీమణుల్లో సమంత ఒకరుగా నిలిచారు. యాహూ విడుదల చేసిన ఈ జాబితాలో సామ్ 10వ స్థానంను దక్కించుకున్నారు. ఈ ఏడాది అనేక కారణాలతో సమంత వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు హాట్ టాపిక్ అయింది.
Pushpa Making Video: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రానికి సంబంధించి తాజాగా మేకింగ్ వీడియో విడుదలైంది. మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్‌కి సంబంధించిన దృశ్యాలు ఇందులో చూడవచ్చు.
కొన్ని తెలుగు పెద్ద సినిమాలు ఈ నెల (డిసెంబర్)లోనే విడుదల కాబోతున్నాయి. దాంతో అభిమానులు ముందుగానే సంక్రాంతి పండగ చేసుకోనున్నారు. పుష్ప, శ్యామ్ సింగరాయ్, గని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.