Samantha: స‌మంత ఏమాత్రం తగ్గట్లే.. బాలీవుడ్ భామలకు ధీటుగా! విడాకుల అనంతరం రికార్డు!!

ఈ ఏడాది దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినీ నటీమణుల్లో సమంత ఒకరుగా నిలిచారు. యాహూ విడుదల చేసిన ఈ జాబితాలో సామ్ 10వ స్థానంను దక్కించుకున్నారు. ఈ ఏడాది అనేక కారణాలతో సమంత వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైత‌న్య‌తో విడాకులు హాట్ టాపిక్ అయింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 05:57 PM IST
Samantha: స‌మంత ఏమాత్రం తగ్గట్లే.. బాలీవుడ్ భామలకు ధీటుగా! విడాకుల అనంతరం రికార్డు!!

Samantha is the 10th most searched female actress of 2021 in India: టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైత‌న్య‌ (Naga Chaitanya)తో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ స‌మంత రుతు ప్రభు (Samantha) త‌న సినీ కెరీర్‌పైనే పూర్తిగా ఫోక‌స్ పెట్టారు. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఓ హాలీవుడ్ సినిమాలో కూడా నటించే అవకాశం అందుకున్నారు. త్వరలోనే సామ్ సినిమా షూటింగులలో పాల్గొననున్నారు. మరోవైపు సోష‌ల్ మీడియాలో గతంలో ఎన్నడూ లేనంతగా రచ్చ చేస్తున్నారు. ఆసక్తికర పోస్టులతో పాటు హాట్ హాట్ ఫొటోలతో స‌మంత కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. విడాకుల అనంతరం సామ్ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళుతున్నారు. 

ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు దాటిందని ఓ పోస్ట్ చేసి స‌మంత (Samantha) ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మరో రికార్డు సామ్ ఖాతాలో పడింది. ఈ ఏడాది దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినీ నటీమణుల్లో సమంత ఒకరుగా నిలిచారు. యాహూ (Yahoo) విడుదల చేసిన ఈ జాబితాలో సామ్ 10వ స్థానంను దక్కించుకున్నారు. ఈ ఏడాది అనేక కారణాలతో సమంత వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైత‌న్య‌తో విడాకులు హాట్ టాపిక్ అయింది. ఈ విషయంపై కొంతమంది ఆమెను ట్రోల్ చేయగా.. మరి కొంతమంది మద్దతుగా నిలిచారు. విడాకులకు కారణాలు ఏంటని చాలా మంది సెర్చ్ చేశారు. 

Also Read: Ajaz Patel Viral video: అజాజ్ పటేల్‌తో విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, సిరాజ్.. వైరల్ వీడియో

ఈ ఏడాది దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) అగ్రస్థానంలో నిలిచారు. రెండవ సారి గర్భం దాల్చడం మరియు ఈ విషయంపై ఆమె రాసిన పుస్తకం కారణంగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. ఇక హీరోల జాబితాకు వస్తే.. సిద్ధార్థ్ శుక్లా మొదటి స్థానం ఆక్రమించారు. సిద్ధార్థ్ ఆకస్మిక మరణం దేశంలోని పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ (Allu Arjun), పునీత్ రాజ్‌కుమార్ వరుసగా 2, 3 మరియు 4 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ సంవత్సరం అత్యధికంగా శోధించబడిన ఇతర వ్యక్తుల విషయానికి వస్తే.. పీఎం నరేంద్ర మోదీ యాహూ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

Also Read: హృతిక్ ​రోషన్​ మాజీ భార్య​​ రిలేషన్​షిప్​పై స్పందించిన బాలీవుడ్ హీరో.. తను, నేను అంటూ క్లారిటీ ఇచ్చేశాడు!!

2010లో వచ్చిన 'ఏం మాయ చేశావే' సినిమాలో నాగ చైత‌న్య‌ (Naga Chaitanya), సమంత (Samantha) నటించారు. ఆ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ఈ జోడి హిట్ పెయిర్ అనే టాక్ వచ్చింది. అప్పటి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 2017లో వివాహం చేసుకున్నారు. అయితే నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. విడాకులకు సంబందించిన కారణాలు ఏంటని ఇప్పటికి తెలియరాలేదు. ప్రస్తుతం నాగ చైత‌న్య‌, సమంత తమ సినీ కెరీర్‌పై దృష్టిపెట్టారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News