Pushpa Samanthas special song : 'మీ మగ బుద్దే.. వంకర బుద్ది' అంటున్న సామ్.. అల్లకల్లోలం చేసిన సమంత

Pushpa Movie Samanthas special song :  మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసిన సమంత ఐటెం సాంగ్‌ని పుష్ప మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. లంగా జాకెట్‌ ధరించి, మాస్‌ లుక్‌తో అదిరిపోయింది సమంత. పాట మొత్తం మస్త్‌ మాస్‌గా సాగుతుంది. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అంటూ సాగే పాట అదిరిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 07:11 PM IST
  • పుష్ప మూవీ నుంచి రిలీజైన ఐటెం సాంగ్
  • అదిరిపోయిన సమంత స్పెషల్ సాంగ్
Pushpa Samanthas special song : 'మీ మగ బుద్దే.. వంకర బుద్ది' అంటున్న సామ్.. అల్లకల్లోలం చేసిన సమంత

Allu Arjuns Pushpa The Rise Movie Samanthas special song OoAntavaOoOoAntava released : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న మూవీ పుష్ప. ఈ మూవీలో సమంత ఐటెం సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. ఇక సమంత స్పెషల్ సాంగ్ ఉందనే వార్త వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఫ్యాన్స్‌ సమంత స్పెషల్ సాంగ్ కోసం ఎంతో ఎదురు చూశారు.

 

మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసిన సమంత ఐటెం సాంగ్‌ని పుష్ప మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. లంగా జాకెట్‌ ధరించి, మాస్‌ లుక్‌తో అదిరిపోయింది సమంత. పాట మొత్తం మస్త్‌ మాస్‌గా సాగుతుంది. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అంటూ సాగే ఈ లిరికల్ పాట రిలీజైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'మీ మగ బుద్దే.. వంకర బుద్ది' అంటూ సామ్.. అల్లకల్లోలం చేసింది. ఇతర భాషల్లోనూ ఈ ఐటెమ్‌ సాంగ్ వచ్చేసింది. 

ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించారు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. మీ మగ బుద్దే.. వంకర బుద్ది' అంటూ అదిరిపోయే క్లాసీ సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్. ఇంద్రావతిచౌహాన్ ఈ పాటను హస్కీ వాయిస్‌తో మస్త్ రొమాంటిక్‌గా పాడారు. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఉండనుంది. 

కెరీర్‌లో సామ్ ఇప్పటి వరకూ ఒక్క స్పెషల్‌ సాంగ్ కూడా చేయలేదు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ కోసం పుష్ప మూవీలో స్పెషల్‌ సాంగ్‌ కోసం స్టెప్‌లు వేసింది. ఈ పాట కోసం సామ్ దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయల దాకా తీసుకున్నట్లు టాక్. ఏదైతే ఏం.. పుష్ప మూవీకి..  ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. మీ మగ బుద్దే.. వంకర బుద్ది అనే స్పెషల్ సాంగ్ సెంటరాఫ్ అట్రాక్షన్ మారనుంది.

 

 

Trending News