Allu Arjun: విజయ్ దేవరకొండతో.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. రేపే #PushpaTheRise విడుదల

Allu Arjun about Pushpa movie: అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం సమీపించింది. పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ విడుదలకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో (Allu Arjun fans) పాటు అన్నివర్గాల ఆడియెన్స్ కూడా పుష్ప మూవీ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:49 PM IST
Allu Arjun: విజయ్ దేవరకొండతో.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. రేపే #PushpaTheRise విడుదల

Allu Arjun about Pushpa movie: అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం సమీపించింది. పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ విడుదలకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు అన్నివర్గాల ఆడియెన్స్ కూడా పుష్ప మూవీ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు (Allu Arjun fans)     మాస్ చిత్రాలను నచ్చే మాస్ ఆడియెన్స్ పుష్ప మూవీపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గెటప్, భాష, యాస, పాటలు అన్నీ ఊర మాస్ స్టైల్లో ఉండటమే అందుకు కారణం.

డిసెంబర్ 17న పుష్ప మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రముఖ హీరోలు, హీరోయిన్స్ పుష్ప టీమ్‌కి, అల్లు అర్జున్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా అల్లు అర్జున్‌కి (Vijay Deverakonda to Allu Arjun) విషెస్ చెబుతూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 

Also read : Sanchari Song: రాధే శ్యామ్​ నుంచి 'సంచారి' పాట రిలీజ్​- ప్రభాస్​లో కొత్త కోణం..

పుష్ప మూవీ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్న విజయ్ దేవరకొండ.. పుష్ప ట్రైలర్ (Pushpa trailer Telugu), పుష్ప మూవీ సాంగ్స్, విజువల్స్, పర్‌ఫార్మెన్సులు.. అంతా మాస్ స్టైల్లో ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. పుష్ప సినిమా తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తూ మూవీ భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్పందిస్తూ.. మీ ప్రేమాభిమానాలకు థాంక్స్ బ్రదర్ అని బదులిచ్చాడు. పుష్ప మూవీ మీ మనస్సు గెల్చుకుంటుందని ఆశిస్తున్నానని... జనం నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఉందని తెలిపాడు. శుక్రవారం పుష్ప మూవీ థియేటర్లలోకి (Pushpa movie disputes) వస్తుందని గుర్తుచేసిన అల్లు అర్జున్.. తగ్గేదేలే అంటూ విజయ్ దేవరకొండకు అదే ట్వీట్‌కి రిప్లై ట్వీట్ ద్వారా బదులిచ్చాడు.

Also read : Pragathi Dance: అమ్మో.. ప్రగతి మళ్లీ రచ్చచేసిందిగా! నాగిని డ్యాన్స్‌తో అందాల ఆరబోత మాములుగా లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News