Samantha item song: వివాదంలో సమంత ఐటెం సాంగ్-పాటను నిషేధించాలంటూ హైకోర్టుకు..

పుష్ప సినిమాలో హీరోయిన్ సమంత ఐటెం నంబర్ వివాదాస్పదమవుతోంది.  'మీ మగ బుద్దే వంకర బుద్ధి' అనే ఐటెం సాంగ్ లిరిక్స్ పురుషుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురుష సంఘాలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 01:13 PM IST
  • వివాదాస్పదమవుతోన్న సమంత పుష్ప ఐటెం సాంగ్
  • పురుషుల మనోభావాలు దెబ్బతిన్నాయనే విమర్శలు
  • హైకోర్టును ఆశ్రయించిన ఏపీ పురుషుల సంఘం
Samantha item song: వివాదంలో సమంత ఐటెం సాంగ్-పాటను నిషేధించాలంటూ హైకోర్టుకు..

Samantha item Song Controversy: పుష్ప సినిమాలో (Pushpa) హీరోయిన్ సమంత ఐటెం నంబర్ వివాదాస్పదమవుతోంది.  'మీ మగ బుద్దే వంకర బుద్ధి' అనే ఐటెం సాంగ్ లిరిక్స్ పురుషుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురుష సంఘాలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం సమంత ఐటెం సాంగ్‌పై (Samantha item song) నిషేధం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. మగవారిపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఈ పాట ఉందని... వెంటనే దీన్ని సినిమా నుంచి తొలగించాలని ఆ సంఘం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. పలువురు చంద్రబోస్ (Lyricist Chandrabose) సాహిత్యాన్ని అభినందిస్తుండగా... మరికొందరు విమర్శిస్తున్నారు. ఐటెం సాంగ్‌లోనూ అద్భుతమైన మెసేజ్ ఇచ్చేలా చంద్రబోస్ సాహిత్యం అందించారని కొంతమంది ప్రశంసిస్తున్నారు.  మహిళల రంగు, రూపు, దుస్తులతో సంబంధం లేకుండా పురుషులు వారి పట్ల ఎలాంటి భావనతో ఉంటారనే విషయాన్ని చంద్రబోస్ తన సాహిత్యం ద్వారా చెప్పుకొచ్చారు. అయితే.. ఇలా పనిగట్టుకుని పురుషులపై ద్వేషం వెల్లగక్కడమేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

వివాదం సంగతి పక్కనపెడితే... సమంత 'ఊ అంటావా మావా...' సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ పాటకు 25 మిలియన్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. సమంత మొదటిసారి ఐటెం సాంగ్‌లో నటించడం... చంద్రబోస్ అందించిన సాహిత్యంతో స్పెషల్ అటెన్షన్ ఏర్పడటంతో వెండి తెరపై ఈ పాటను చూసేందుకు అభిమానులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు పుష్ప హీరో అల్లు అర్జున్ సైతం... సినిమాలో ఈ సాంగ్ మరో లెవల్‌లో ఉంటుందని చెప్పడంతో సమంత సాంగ్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. అల్లు అర్జున్‌-రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా (Pushpa Movie) డిసెంబర్‌17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Virata Parvam: అదిరిపోయిన రానా 'వాయిస్ ఆఫ్ రవన్న'.. రివల్యూషనరీ పొయెటిక్ సెన్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News