David Warner: 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటున్న​ వార్నర్ భాయ్​.. 'తగ్గేదే లే' అంటూ ఐకాన్ స్టార్ రిప్లై

David Warner: సన్​రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు.. డైవిడ్ వార్నర్.. పుష్పా సాంగ్​ వీడియోతో ఇన్​స్టాలో సందడి చేశాడు. ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ సహా.. పలువురు క్రికెటర్లు ఫన్నిగా స్పందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 05:39 PM IST
  • పుష్పా సాంగ్​కు డేవిడ్ వార్నర్ స్పూఫ్
  • రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్​
  • ఫన్నిగా స్పందించిన విరాట్ కోహ్లీ
David Warner: 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటున్న​ వార్నర్ భాయ్​.. 'తగ్గేదే లే' అంటూ ఐకాన్ స్టార్ రిప్లై

David Warner: డేవిడ్ వార్నర్​.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు చాలా సుపరిచితం. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు.. ఐపీఎల్​ ద్వారా ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్ (SRH) తరఫున ఆడి.. ఎంతో మంది అభిమానులకు ఫేవరెట్ ప్లేయర్​గా కూడా మారాడు. ఆటతో మాత్రమే కాకుండా.. సోషల్​ మీడియాలో కూడా అభిమానులకు వినోదాన్ని పంచుతుంటాడు ఈ ఆడగాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉండే వార్నర్​.. గత ఏడాది లాక్​డౌన్​లో (Lock down) ఫుల్​ ఎంటర్​టైన్మెంట్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలు, మాస్​ డైలాగ్స్​ను 'ఫేస్ మార్ఫ్​' ద్వారా మార్చి.. ఇన్​స్టాలో పోస్ట్ (David Warner Funny Videos) చేస్తుంటాడు. అభిమానులు ఎడిట్​ చేసిన వీడియోలను కూడా అప్పుడప్పుడు పోస్ట్​ చేస్తుంటాడు.

ఇలా గత ఏడాది 'బుట్టబొమ్మ', 'మైండ్ బ్లాక్' సహా పలు పాటలకు వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీనిపై తెలుగు సినీ వర్గాలు కూడా చర్చించుకోవడం విశేషం.

అయితే తాజాగా.. వార్నర్ ఇన్​స్టాలో మరో కొత్త వీడియో పోస్ట్ చేశారు. తెలుగులో భారీ అంచనాలున్న 'పుష్ప సినిమా'లోని.. 'ఏయ్​ బిడ్డా.. ఇది నా.. అడ్డ' (Eyy Bidda Idhi Naa Adda) అనే సాంగ్​లో అల్లు అర్జున్​ ఫేస్​ స్థానంలో తన ఫేస్​ ఉన్న ఓ వీడియోను పోస్ట్​ చేశాడు. ఈ వీడియో ఫన్నిగా ఉండటంతో వైరల్​గా మారింది.

కామెంట్స్ కూడా అదుర్సే..

ఈ వీడియో చూసి సాధారణ అభిమానులతో పాటు.. సెలెబ్రెటీలు, క్రికెటర్లు కూడా కామెంట్ చేస్తున్నారు.

ముఖ్యంగా 'పుష్పా' సినిమాలో హీరోగా నడించిన 'ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్' (Allu Arjun reply to David Warner) ఈ వీడియోపై స్పందించారు. 'మై బ్రదర్ వార్నర్​.. తగ్గేదే లే' అంటూ (Pushpa dialogue) రిప్లై ఇవ్వడం విశేషం.

మరోవైపు క్రికెట్ కింగ్ విరాట్​ కోహ్లీ (Virat Kohli comments on David Warner Video) కూడా.. 'డేవిడ్ భాయ్ అంతా ఓకేనా' అంటూ స్పందించగా.. అందుకు వార్నర్​ మరో ఫన్ని రిప్లై ఇచ్చాడు. మరో క్రికెటర్ వృద్ధిమాన్​ సాహా కూడా.. ఈ వీడియోపై స్పందించాడు.

ఈ వీడియోను నిన్న పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా చూశారు. 7.8 లక్షల మంది లైక్ కొట్టారు. 

Also read: Bigg Boss Telugu 5: ర్యాంకుల కోసం కంటెస్టెంట్ల మధ్య పోటీ..ఎవరికి ఏ పొజిషన్ దక్కిందంటే..

Also read: Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News