Tollywood: డిసెంబర్ మాసంలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే.. అభిమానులకు పండగే ఇగ!!

కొన్ని తెలుగు పెద్ద సినిమాలు ఈ నెల (డిసెంబర్‌)లోనే విడుదల కాబోతున్నాయి. దాంతో అభిమానులు ముందుగానే సంక్రాంతి పండగ చేసుకోనున్నారు. పుష్ప, శ్యామ్‌ సింగరాయ్‌, గని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 07:45 PM IST
  • డిసెంబర్ మాసంలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే
  • తెలుగు సినిమా అభిమానులకు పండగే ఇగ
  • విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప, శ్యామ్‌ సింగరాయ్‌, గని
Tollywood: డిసెంబర్ మాసంలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే.. అభిమానులకు పండగే ఇగ!!

Here is Telugu movies list to release in December 2021: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో థియేటర్లలో సినిమాలు ఎక్కువగా విడుదల కాలేదు. చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఆ సమయంలో వెబ్‌ సిరీస్‌లు కూడా ఓటీటీలో సందడి చేయడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే వాక్సిన్ రావడం, కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది థియేటర్లలో విడుదలయ్యే  తెలుగు సినిమాల సంఖ్య పెరిగింది. పెద్ద సినిమాలు కొన్ని థియేటర్లలో విడుదల అయి బంపర్ హిట్ కొట్టాయి. మరికొన్ని డిసెంబర్, జనవరి మాసాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పెద్ద సినిమాలు ఈ నెల (డిసెంబర్‌)లోనే విడుదల కాబోతున్నాయి. దాంతో అభిమానులు ముందుగానే సంక్రాంతి పండగ చేసుకోనున్నారు. ఆ సినిమాలేవో ఓసారి చూద్దాం. 

పుష్ప:
డిసెంబర్‌ మాసంలో విడుదలయ్యే పెద్ద సినిమాలలో పుష్ప ఒకటి. సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప (Pushpa) రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదల కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun).. లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కాబట్టి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందాన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Also Read: Shubman Gill: హెన్రీ నికోల్స్ భారీ షాట్.. శుభ్‌మాన్ గిల్‌కు గాయం! ఓపెనర్‌గా చేతేశ్వర్ పుజారా (వీడియో)

శ్యామ్‌ సింగరాయ్‌:
'నాచురల్ స్టార్' నాని (Nani) నటించిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) సినిమా కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్‌ 24న విడుదలయ్యే ఈ సినిమా.. బెంగాల్‌లో తెలుగోడు సత్తాచాటే కథతో తెరకెక్కిందని సమాచారం. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశె ట్టి, మడోన్నాసెబాస్టియన్‌ కథానాయికలుగా నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవలి కాలంలో నాని వరుస హిట్టులతో దూసుకుపోతుండడంతో.. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

గని:
'మెగా పవర్ స్టార్' వరుణ్‌ తేజ్‌ (Varun Tej ) కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం 'గని' (Ghani) చిత్రం డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కొత్త కుర్రాడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి సాయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోలు జగపతి బాబు, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: Mob Lynching: పాక్‌లో శ్రీలంక జాతీయుడి దారుణ హత్య-నడిరోడ్డుపై కొట్టి చంపి,తగలబెట్టారు

83:
టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ (Kapil Dev) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా '83'. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి.. చివరకు డిసెంబర్‌ 24న విడుదలకు సిద్ధమైంది. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె,  తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవి, కీలక పాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై కింగ్ నాగార్జున విడుదల చేస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా డిసెంబర్ మాసంలో విడుదల కానున్నాయి. డిసెంబర్‌ 17న స్పైడర్‌ మ్యాన్‌ నో వే హోమ్‌, డిసెంబరు 24 అత్రంగి రే, డిసెంబర్‌ 31న జెర్సీ విడుదల కానున్నాయి. కబీర్‌ సింగ్‌, డోంట్‌ లుక్‌ అప్‌, ఛండీగఢ్‌ కరే ఆషికీ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News