హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ)లో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్ధి సంఘాలు కాలేజీలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మోహరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు బయల్దేరారు. ఢిల్లీ లో కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానం ఎక్కారు. ప్రత్యేక వాయు విమానంలో ఆయన బయల్దేరారు. ప్రస్తుతం జర్నీలో ఉన్నారు. హైదరాబాద్ లోని బేంగంపేట విమానాశ్రయం లో ఫ్లైట్ లాండ్ అవుతుంది. మరో అర్థగంటలో ఆయన చేరుకుంటారు. మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రోటోకాల్ అధికారులు బేగంపేట చేరుకోనున్నారు. మోదీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో మెట్రో రైలు తో పాటు జీఈఎస్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. !
అమెరికా-భారత్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న 8వ గ్లోబల్ ఇంట్రాప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) మంగవారం నుండి హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న హెచ్ఐసీసీలో ప్రారంభం కానున్నది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె.. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ రానున్నవేళ ఆమెకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలు ఉంచి ఇవాంకా పర్యటనను, ఆమె పరిసర ప్రాంతాల్ని పర్యవేక్షిస్తుంటారు.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలోని సికింద్రాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో డెంగ్యూ ఆనవాళ్లు కన్పించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు గడిచిన కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడటంతో స్వైన్‌ఫ్లూ భయంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రతి ఏడాది ఇదే నెలలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. బహుశా ఇది కూడా వారి భయానికి కారణం అయి ఉండవచ్చు. ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురవటం, చలి ఎక్కువగా ఉండటంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉంది.
ఇవాళ 52వ పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు మన హైదరాబాద్‌తో కూడా అవినాభావ సంబంధముంది. ఇది కొంత మందికి మాత్రమే తెలిసిన విషయం . ఇంతకీ అదేమిటంటే షారూక్ తల్లిది మన హైదరాబాదేనట. 1965లో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు ఢిల్లీలో షారుక్ ఖాన్ జన్మించాడు. తండ్రిది స్వస్థలం పెషావర్ (పాకిస్తాన్ ) ప్రాంతం..కాగా తన తల్లి స్వస్థలం హైదరాబాద్ ప్రాంతం. అలాగే షారూక్ నానమ్మది కశ్మీర్. షారుఖ్‌కు 15 ఏళ్ల వయసులోనే 1981లో తండ్రి క్యాన్సర్‌తో చనిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైల్వే కోచ్ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి జిల్లాలోని కొండకల్లో రైల్/మెట్రో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు తెలిపారు. మంత్రి శుక్రవారం, భారతీయ రైల్వేకు చోదన పరికరాల సరఫరాదారు అయిన మేధా సర్వో డ్రైవ్స్ తో ఎంఓయు సంతకం వేడుకకు హాజరయ్యారు. ఒక హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం.. మేధా సర్వో డ్రైవ్స్ తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
సన్నీ లియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్. ఇప్పుడు బాలీవూడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుంది. మొనీమధ్య కేరళలో ఒక షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లిన సన్నీ లియోన్ ను చూడటానికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. దాంతో సన్నీకి ఉన్న క్రేజ్ చూసి దేశం అంతటా తెలిసిపోయింది.
సన్నీ లియోన్ హైదరాబాద్ కు రానున్నారని టాక్. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 'గరుడ వేగ' సినిమాలో ఆమె ఒక ఐటమ్ సాంగ్ కు స్టెప్పులేసింది. ఈ నెల 27 సినిమా ఆడియో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఈవెంట్ కు సన్నీ లియోన్ హాజరుకానున్నారు, ఓ సాంగ్ కి లైవ్ పెర్ఫామెన్స్ చేయనుందని సమాచారం.
భారతీయ నగరాల్లో అధిక శాతం ప్రజలు పని ఒత్తిడితో, మానసిక సమస్యలతో ఆందోళన చెందుతున్నారని అధ్యయనం ద్వారా తెలిసింది. ప్రధాన నగరాల్లో 60 శాతం మంది ఉద్యోగులు పని ఒత్తిడికి లోనవుతున్నారని ఆన్లైన్ డాక్టర్ల కన్సల్టెంట్ ఫోరమ్, లీబ్రేట్ చెప్పింది. పని ఒత్తిడి సమస్యలతో ఆందోళన చెందుతున్న నగరాల్లో వాణిజ్య నగరం ముంబై (31 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వరుసగా దిల్లీ (27 శాతం), బెంగళూరు (14 శాతం), హైదరాబాద్ (11 శాతం), చెన్నై (10 శాతం ), కోల్‌కతా (7 శాతం) నగరాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించడం కోసం మరియు మైట్రోరైలు పనులు, స్కైవే పనులకు అంతరాయం తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్, అదనపు డీసీపీ దివ్యచరణ్రావు, ఏసీపీ శ్రీధర్‌లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం నుండి ఎల్బీ నగర్చౌరస్తాను బంద్ చేసి ఎల్పీటీ మార్కెట్, డీమార్ట్‌ల ముందు యు టర్న్‌లు తెరవడానికి ఏర్పాటు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.