Fever Hospital Doctor Detained By Private Hospital | కరోనా ట్రీట్మెంట్ బిల్లు కష్టాలు డాక్టర్లకు సైతం తప్పడం లేదు. తనకు ఒక్కరోజు ట్రీట్మెంట్కు లక్ష బిల్లు ఎలా వేశారని ప్రశ్నించిన లేడీ డాక్టర్‌ను ఆ హాస్పిటల్ యాజమాన్యం నిర్బంధించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది.
కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయినా చావు తప్పడం లేదంటున్నారు చనిపోయిన పేషెంట్ల బంధువులు. అంత్యక్రియలు నిర్వహించేందుదకు అవకాశం ఉండటం లేదని బాధ పడుతుంటే.. కరోనాతో చనిపోయిన పేషెంట్ల మృతదేహాలను సగం కాలిన తర్వాత కుక్కలు తింటున్న దారుణ ఘటన (Dogs Eating Corona Patient Deadbodies) హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
Hyderabad Man Commits Suicide | ఇద్దరు అక్కలను దారుణంగా హత్యచేసి, మరో సోదరి, బావలపై కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితి డెడ్ బాడీని అతడి ఇంట్లోనే గుర్తించారు.
Telangana COVID19 Cases:హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ ( Corona Virus ) వినాశనం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి.
A Psycho killed siblings in Hyderabad | అమ్మకు బాగోలేదంటూ తోబుట్టువులను ఇంటికి రప్పించాడు. ప్లాన్ ప్రకారం వారిపై కత్తితో దాడి చేసి దురాగతానికి పాల్పడ్డాడు ఆ నిందితుడు. ఇంటికి రాని మరో అక్క ఇంటికి వెళ్లి ఆమెపైనా, అడ్డువచ్చిన బావపైన కత్తితో దాడి చేశాడు. మరో అక్కను చంపేసేందుకు కత్తితో వెళ్లాడు. పోలీసులను చూసి పరారయ్యాడు.
Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
తొలి రోజుల్లో కరోనా వైరస్ కేసులు కేరళలో ఎక్కువగా నమోదై ఆందోళన కలిగించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం సురక్షితంగా ఉండగా.. మరోవైపు కరోనా కేసులు(Telangana CoronaVirus Cases) అంతగాలేని తెలంగాణ ఇప్పడు కరోనా కేసులకు నిలయంగా మారింది. వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులకు కొరత ఏర్పడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భోజనం ఇచ్చిరమ్మని తన సోదరుడి ఇంటికి 12 ఏళ్ల కూతుర్ని తల్లి పంపించింది. ఇదే అవకాశంగా భావించిన క్రైమ్ కానిస్టేబుల్ పశువులా ప్రవర్తించి మైనర్ బాలికపై అత్యాచారం(Minor Girl Raped in Hyderabad) చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం చాలా అవసరం. దీని వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ క్రమంలో క్యాబ్‌లో అడ్డుగా కవరు పెట్టి సోషల్ డిస్టాన్సింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో పన్ను చెల్లించని వారిని అధికారులు అలర్ట్ చేశారు. పన్నులు చెల్లించని 8 లక్షల 24 వేల మందికి GHMC అధికారులు వాట్సాప్‌లో సందేశాలు పంపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ రోడ్లమీదకి రావొద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్‌లో ఓ సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దికాలంగా CRPF SIగా పని చేస్తున్న భవానీ శంకర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే రెండు కోచ్ లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణీకులు వెంటనే ట్రెయిన్ దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ట్యూషన్‌కు వెళ్లివస్తుండగా అతడిని అడ్డగించి కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాదాపు ఎనిమిది మంది వంశీపై దాడికి పాల్పడ్డారు. కొందరు బ్లేడుతో దాడిచేసి వంశీని గాయపరిచారు.
హైదరాబాద్ లోని ఇంటర్మీడియెట్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. Go నంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.