హైదరాబాద్‌లో 21 లక్షల బోగస్ ఓటర్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 21 లక్షలమంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Last Updated : Dec 2, 2017, 06:33 PM IST
హైదరాబాద్‌లో 21 లక్షల బోగస్ ఓటర్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 21 లక్షలమంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవలే అధికార యంత్రాంగం మళ్లీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఈ బోగస్ ఓటర్లు ఎక్కువమంది ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. దీంతో ఓటర్ల జాబితాను మళ్లీ సవరించి,ముసాయిదాను ప్రచురించారు.

ఈ మేరకు ఓటర్ల నుండి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించడానికి డిసెంబరు 31 తేదీని గడువు తేదిగా ప్రకటించారు. ఆ తర్వాత ఆఖరి జాబితా తయారయ్యాక, డేటాను జనవరి 13 వరకు సిస్టమ్స్‌లో నిక్షిప్తం చేసి, జనవరి 20వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.  ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించారు.

Trending News