Revanth Reddy: ముందస్తు ఎన్నికల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం కాక రేపుతోంది.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు
TPCC New Chief: తెలంగాణలో కాంగ్రెస్ బాస్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరనేది ఈ ఏడాది తేల్చడం లేదని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు.
డ్రోన్‌తో ఫామ్ హౌస్ ఫోటోలు తీశారన్న అభియోగాలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల రిమాండుకు తరలించారు. తాజాగా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ రాజధాని పరిణామాలు చూస్తే తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా ఉన్నప్పటికీ భారతీయుడిగా తనను బాధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తానంటున్నారు. పార్లమెంట్ కార్యదర్శుల నియామకంలో తెలంగాణ ప్రభుత్వం నియమనిబంధనలని పాటించలేదని, పూర్తిగా అక్రమంగా జరిగిన వారి నియామకం చెల్లదని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. శనివారం ఇదే విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "తెలంగాణ ప్రభుత్వం ప్రజలకి అబద్దాలు చెప్పి, కోర్టు కళ్లుకప్పి 121 మంది పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చేసింది" అని అన్నారు.
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిపై రాంగోపాల్ వర్మ ప్రసంశల జల్లు కురిపించాడు. యువ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు బాహుబలి లాంటివాడని..ఆయన చేరికతో కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కుపిస్తుందని కొనియాడుతూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.