Telangana Survey: తెలంగాణ లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్.. ఆ పార్టీకి మూడో స్థానమే?

Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు

Written by - Srisailam | Last Updated : Jul 2, 2022, 10:18 AM IST
  • తెలంగాణ ఎన్నికలపై తాజా సర్వే
  • రేవంత్ రెడ్డి సర్వేలో షాకింగ్ రిజల్ట్
  • బీజేపీకి కేవలం 14 సీట్లు
Telangana Survey: తెలంగాణ లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్.. ఆ పార్టీకి మూడో స్థానమే?

Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి. 2018 తరహాలోనే సీఎం కేసీఆర్  ముందస్తు ఎన్నికలకు వెళ్తారని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. నిత్యం ప్రజల్లోనే ఉండే  ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెండు పార్టీల జాతీయ అగ్ర నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా రాజకీయం చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. విపక్షాలకు ధీటుగా అధికార పార్టీ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్ లో జోష్ నింపుతోంది. అదే సమయంలో సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు. సర్వేల ఆధారంగానే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.

దేశంలోనే టాప్ వ్యూహకర్తగా చెప్పుకునే ప్రశాంత్ కిషోర్.. టీఆర్ఎస్ కోసం వర్క్ చేస్తున్నారు. ఐప్యాక్ టీమ్ లు తెలంగాణలో పర్యటిస్తూ ప్రజల నాడి తెలుసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కేసీఆర్ కు నివేదికలు ఇస్తున్నాయి. పీకే టీమ్ నివేదికల ఆధారంగా పార్టీ నేతలను అలర్ట్ చేస్తున్నారు గులాబీ బాస్. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యమంటున్న బీజేపీ హైకమాండ్. .ప్రత్యేక టీములతో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీస్తోందని తెలుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా సర్వే బృందాలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అధినాయకత్వం గతంలో పీకేతో కలిసి పని చేసిన సునీల్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంతంగా మరో సంస్థతో సర్వే నిర్వహించుకున్నారని తెలుస్తోంది.  రేవంత్ రెడ్డి కోసం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ  సంస్థ చేసిన సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయట. రేవంత్ రెడ్డి సర్వేకు సంబంధించిన విషయాలు వెలుగులోనికి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది

రేవంత్ రెడ్డి కోసం నెల్లూరు సంస్థ నిర్వహించిన సర్వేలో అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చేలా సర్వేలో ప్రజలు తీర్పు ఇచ్చారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లలో గెలిచింది టీఆర్ఎస్. తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్లు కారు గూటికి చేరారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం సెంచరీ దాటేసింది. కాని తాజా సర్వేలో  కారు పార్టీకి 44 స్థానాలు మాత్రమే వస్తాయని వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్సాహంగా కనిపిస్తోన్న కాంగ్రెస్ పార్టీ 54 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఇక ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లో దూకుడు పాలిటిక్స్ చేస్తున్న బీజేపీకి సర్వేలో నిరాశజనక ఫలితాలు వచ్చాయి. కాషాయ జెండా ఎగరవేస్తామని చెబుతున్న బీజేపీకి కేవలం 14 సీట్లే వస్తాయని సర్వేలో స్పష్టమైంది. ఎంఐఎం పార్టీ ఏడు సీట్లతో పాతబస్తీలో తమ పట్టు కాపాడుకుటుందని తాజా సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉన్నా ఇంకొంత కష్టపడితే కారు పార్టీకి 60 సీట్ల వరకు రావొచ్చని సర్వేలో తేలిందని తెలుస్తోంది. 

Read also: Covid Cases: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. మరో మూడు వారాలు డేంజరే?

Read also: Rahul Ramakrishna: మళ్ళీ నోరుజారిన రాహుల్ రామకృష్ణ… గు*లో దమ్ముంటే సినిమా చేయాలట!

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News