ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, రాష్ట్ర సంప్రదాయ వంటకాలను, హైదరాబాద్ నగర ఆహార సంస్కృతిని రుచి చూపే పదార్థాలను వండి వార్చి వడ్డించింది.
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కితాబునందుకుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ జాతరకు యూనెస్కో గుర్తింపు దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని ఆమె తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 4,700 మంది పిల్లలు అదృశ్యమైనట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, 2016లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4,700 మంది పిల్లలు తప్పిపోయారు.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు, పరీక్షా విధానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా నేడు తమకు వచ్చే తక్కువ మార్కులను.. ఇతరులకు వచ్చే ఎక్కువ మార్కులతో పోల్చుకుంటూ.. ఆ తారతమ్యాల వల్ల విద్యార్థులు ఆత్మనూన్యతాభావాన్ని పెంచుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా ఎలాగైతే జీతాలు అందుతున్నాయో.. అలాగే వచ్చే నెల నుండి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే వేతనం జమచేస్తామన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గిరిజన ఉత్సవం (ఆది మహోత్సవ్) పోటీల్లో తెలంగాణ తరఫున ఉత్తమ వంటకాల విభాగంలో పోటీ పడిన "బంజారా బిర్యానీ" మొదటి బహుమతిని గెలుచుకుంది.
ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న 50 జైళ్ళలో దాదాపు 5848 ఖైదీలు ఉన్నారు. అయితే జైళ్ళ కెపాసిటీ ప్రకారం ఇంకా 1000 మంది ఖైదీలకు చోటు ఉందని, ఆ అవకాశాన్ని ఇతర రాష్ట్రాలు వినియోగించుకోవాలని తెలంగాణ జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ తెలియజేశారు.
హైదరాబాద్లోని ముషీరాబాద్ ఏరియా గాంధీనగర్ నివాసైన కేసీఆర్ బాల్యమిత్రుడు కె. రాజేంద్రప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ తన బాగోగులు అడిగి తెలుసుకున్నారట
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.