నేటి నుంచి హైదరాబాద్ మెట్రోలో స్త్రీలకు ప్రత్యేక బోగీ

హైదరాబాద్ మెట్రో రైల్లో నేటి నుంచి మహిళలకు ప్రత్యేక బోగీని అందుబాటులోనికి తీసుకురానున్నారు.

Last Updated : May 7, 2018, 08:44 AM IST
నేటి నుంచి హైదరాబాద్ మెట్రోలో స్త్రీలకు ప్రత్యేక బోగీ

హైదరాబాద్ మెట్రో రైల్లో నేటి నుంచి మహిళలకు ప్రత్యేక బోగీని అందుబాటులోనికి తీసుకురానున్నారు. మెట్రో రైల్లో మహిళలు మరింత భద్రతగా ప్రయాణించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా మెట్రోరైల్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు బోగిలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న మెట్రోట్రైన్‌లోని మొదటి బోగిని మహిళల కోసం కేటాయించినట్లు, అందులో కేవలం మహిళలే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో తెలిపింది. ఈ సౌకర్యం నేటి నుంచే అమలులోనికి వస్తుందని పేర్కొంది.

ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న  పరిణామాల నేపథ్యంలో మెట్రోలో ప్రయాణించే మహిళలకు మరింత భరోసా కల్పించేందుకే ప్రత్యేక బోగీని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.  సోమవారం ఉదయం 11 గంటలకు మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి అమీర్‌పేట స్టేషన్‌లో ఈ సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.  ఇటీవల మెట్రో వేగం తక్కువగా ఉందని ఫీడ్ బ్యాక్ అందడంతో అధికారులు వేగాన్ని పెంచారు.

Trending News