హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది.
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) కూల్చాలని ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయించడం తెలిసిందే. అయితే మంత్రి మండలి వ్యక్తిగత నిర్ణయం కాదని, అవసరాల మేరకు తీసుకున్న నిర్ణయంగా హైకోర్టు భావించింది.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
మిడతల దండయాత్ర నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పుడు వాటి నుంచి పంటలను కాపడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తోంది. పరిమాణంలో చిన్నగా కనిపించినా మిడతలు పంటలపై పడితే మాత్రం పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి.
తెలంగాణ ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పోస్ట్‌ల రద్దు చేసింది. అడిషన్ కలెక్టర్లుగా జేసీలకు పోస్టింగ్ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తానంటున్నారు. పార్లమెంట్ కార్యదర్శుల నియామకంలో తెలంగాణ ప్రభుత్వం నియమనిబంధనలని పాటించలేదని, పూర్తిగా అక్రమంగా జరిగిన వారి నియామకం చెల్లదని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. శనివారం ఇదే విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "తెలంగాణ ప్రభుత్వం ప్రజలకి అబద్దాలు చెప్పి, కోర్టు కళ్లుకప్పి 121 మంది పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చేసింది" అని అన్నారు.
ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న 50 జైళ్ళలో దాదాపు 5848 ఖైదీలు ఉన్నారు. అయితే జైళ్ళ కెపాసిటీ ప్రకారం ఇంకా 1000 మంది ఖైదీలకు చోటు ఉందని, ఆ అవకాశాన్ని ఇతర రాష్ట్రాలు వినియోగించుకోవాలని తెలంగాణ జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఒక్కో వ్యక్తి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో పరిశీలనలో బియ్యం తెచ్చుకుని అమ్ముకుంటున్న వాళ్లే అత్యధికం ఉన్నారని తేలింది. రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుని, కిలో ఎనిమిదికో, పదికో అమ్ముకుంటున్న వాళ్లే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ లబ్దిదారులకూ నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. నగదు బదిలీకి అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పౌర సరఫరాల అధికారులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఒక్కో ఇంటికి రూ.800 ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.