Hyderabad LockDown Due to coronavirus |హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown)ను సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకోని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Chief Minister K Chandrashekar Rao) మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను తిరిగి అమలు చేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరముందని, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఊపిరి ఆడటం లేదు.. బై డాడీ’ కరోనా పేషెంట్ చివరి వీడియో
అవసరమైతే దీనిపై రెండు, మూడు రోజుల్లో కేబినెట్‌ను సమావవేశపర్చి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ (GHMC) లో మళ్లీ లాక్డౌన్ విధించాలంటే అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని అధికారులకు సూచించారు. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వ పరంగా అన్నీ లోతుగా ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణలోని మహానగరం హైదరాబాద్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. విషాదం: పెళ్లి తంతు ముగిసేలోగా వధువు మృతి
హైదరాబాద్‌లో వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం, రోగులకు అందుబాటులో ఉన్న చికిత్సా సౌకర్యాలు, అందుతున్న వైద్యం, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కె. తారక రామారావు (K. T. Rama Rao), వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన
భయపడాల్సిన అవసరం లేదు.. ఈటల రాజేందర్
జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి దృష్ట్యా మరో 15 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించాలని పలువురు వైద్య, ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాల రేటు తక్కువగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని, పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల పేర్కొన్నారు.
రాష్ట్రంలో మరణాల రేటు తక్కువే...
అనంతరం మెడికల్ అండ్ హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి తన నివేదికను వెల్లడించారు. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా మరణాల జాతీయ సగటు 3.04 కాగా, తెలంగాణలో ఇది 1.52 ఉందన్నారు. రాష్ట్రంలో మరిన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ