ఆ విద్యార్థిని.. హరీష్‌రావుకి పెద్ద ఫ్యాన్..!

 సిద్దిపేట అర్బన్ మండలం ఎన్‌సాన్‌పల్లి గురుకుల పాఠశాలలో సోమవారం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

Last Updated : Jan 1, 2018, 04:11 PM IST
ఆ విద్యార్థిని.. హరీష్‌రావుకి పెద్ద ఫ్యాన్..!

సిద్దిపేట అర్బన్ మండలం ఎన్‌సాన్‌పల్లి గురుకుల పాఠశాలలో సోమవారం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ పాఠశాల న్యూ ఇయర్ వేడుకలకు అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి హరీష్‌రావుతో మాట్లాడుతున్నప్పుడు ఓ విద్యార్థిని చాలా ఉద్వేగానికి లోనైంది. "సార్.. మీతో ఫోటో దిగాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను" అని చెబుతూ ఉన్నట్టుండి ఏడ్చేయడంతో ఆశ్చర్యపోయిన మంత్రి.. ఆ విద్యార్థిని వద్దకు వచ్చి అక్కున చేర్చుకొని ఓదార్చారు.

ఆమె కోరిక మేరకు తనతో కలిసి ఫోటో దిగారు. దివ్య అనే పేరు గల ఆ అమ్మాయి అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనడానికి ఆ పాఠశాలకు వచ్చిన మంత్రి విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేశారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు పంపిణీ చేశారు. 

 

Trending News