తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. జేసీల పోస్ట్ రద్దు

తెలంగాణ ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పోస్ట్‌ల రద్దు చేసింది. అడిషన్ కలెక్టర్లుగా జేసీలకు పోస్టింగ్ ఇచ్చారు.

Last Updated : Feb 10, 2020, 06:51 AM IST
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. జేసీల పోస్ట్ రద్దు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట భారీగా ఐఏఎస్‌ల బదిలీలతో పాటు కొత్త వారికి పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. పాలన సంస్కరణల పేరుతో టీఆర్ఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్ (జేసీ) ఉద్యోగ స్థానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జేసీ స్థానంలో అడిషనల్ కలెక్టర్ (ఏడీసీ) అనే కొత్త పోస్టును టీసర్కార్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లుగా మారుస్తూ వారికి పోస్టింగ్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 49 మంది నాన్‌కేడర్, కేడర్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం.

Also Read: నిర్భయ దోషుల ఉరి వాయిదాపై దిశ తండ్రి సంచలన వ్యాఖ్యలు 

2017 బ్యాచ్ ఐఏఎస్‌లకు ఈ పోస్టింగ్ ఇచ్చింది. వీరికి స్థానిక సంస్థల బాధ్యతలను కూడా అప్పగించడం గమనార్హం. పాలనా పరమైన సంస్కరణలు చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కొన్ని జిల్లాల జేసీలను అడిషనల్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వగా, కొన్ని జిల్లాలకు కొత్త వారిని అడిషనల్ కలెక్టర్లుగా నియమించింది. రెవెన్యూ శాఖ బాధ్యతల్ని వీరికే అప్పగించే అవకాశాలున్నాయి.

Also Read: ‘దిశ చెల్లెలి విషయంలో జాగ్రత్త పడుతున్నాం’

మున్సిపల్ ఎన్నికల వరకు వేచిచూసిన కేసీఆర్.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పాలనా పరమైన అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ సంఖ్యలో ఐఏఎస్‌ల బదిలీలు చేశారు. ప్రస్తుతం జిల్లాల అవసరాన్ని బట్టి ఒక్కరు, ఇద్దరు లేక ముగ్గుర్ని అడిషనల్ కలెక్టర్లుగా నియమించారు. కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జిల్లాల్లోని కొన్ని శాఖల పనులను అడిషనల్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రణాళికలు రూపొందించారు.

Also Read: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, కొత్త వారికి పోస్టింగ్‌లు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News