త్వరలో 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్లు..!

త్వరలోనే హైదరాబాద్ లో  ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్లు కనిపించనున్నాయి.

Last Updated : Dec 12, 2017, 11:22 AM IST
త్వరలో 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్లు..!

హైదరాబాద్: మీరు పోస్ట్ ఆఫీసుకు వెళ్లారు.. అక్కడ ఇంటి అడ్రెస్ ను పోస్ట్ మీద రాయాలి. అప్పుడు మీరేం చేస్తారు? పెన్ను తీసుకొని నాలుగు లేదా ఐదు లైన్ లలో చిరునామాను, పిన్ కోడ్ ను రాస్తారు. అంతేగా..! ఇక మీదట అంతలా రాయాల్సిన అవసరం ఉండదు లేండీ..! ఒకేఒక లైన్ లో ఇంతో చిరుమానా ను రాయవచ్చు. 

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నగర, పట్టాణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి డిజిటల్ డోర్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టు గా మొదట సూర్యాపేట పట్టణంలో ప్రారంభించారు. త్వరలోనే హైదరాబాద్ లో  ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్లు కనిపించనున్నాయి. 

హైదరాబాద్ లో మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి  మీడియాతో మాట్లాడుతూ- "నగరాలూ, పట్టణాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూ క్రయవిక్రయాల సందర్భంలో యజమాని పేరు మారేలా ఆటోమేటిక్ మ్యుటేషన్ అమలు చేస్తున్నాము. ఈ సమయంలో ఇంటి నెంబర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఆ సమస్యను చెక్ పెట్టే దిశగా ఇంటి నెంబర్లను డిజిటల్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు. 

డిజిటల్ ఇంటి నెంబర్లు అంటే ? 

స్థానిక మున్సిపాలిటీ ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ నెంబర్ ఇస్తుంది. ఈ 16 అంకెలు మూడు కోడ్ లుగా విభజిస్తారు. 

మొదటి కోడ్- నగరం లేదా పట్టణాన్ని తెలుపుతుంది. 
రెండవ కోడ్- స్థానిక డివిజన్ లేదా వార్డు ను తెలుపుతుంది. 
మూడవ కోడ్- స్థానిక కాలనీని తెలుపుతుంది. 

ఈ మూడు కోడ్ ల తరువాత ప్రతి ఇంటికి ప్రత్యేక డోర్ నెంబర్లు కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా ఆ ఇల్లు ఎక్కడ, ఏ ఊర్లో, ఏ గల్లీలో ఉందో సులభంగా తెలుసుకుంటారు. 

Trending News