హైదరాబాద్ మెట్రో @ 32.25 లక్షల ప్రయాణికులు

హైదరాబాద్ మెట్రో ప్రారంభమై దాదాపు 30 రోజులు పూర్తయిన సందర్భంగా  హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

Last Updated : Dec 29, 2017, 09:03 PM IST
హైదరాబాద్ మెట్రో @ 32.25 లక్షల ప్రయాణికులు

హైదరాబాద్ మెట్రో ప్రారంభమై దాదాపు 30 రోజులు పూర్తయిన సందర్భంగా  హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నెల రోజుల్లో రికార్డు స్థాయిలో 32.25 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభమైన మెట్రో రైలు ప్రాజెక్టు ప్రజల ఆశలను సాకారం చేసిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం ఈ మెట్రోకి సంబంధించి పార్కింగ్‌ సమస్యను కూడా అధిగమించి.. 23 స్టేషన్లలో ప్రయాణికులకు వెహికల్ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు. అలాగే మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం కేపీహెచ్‌బీ, అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు ఓలా, ఉబర్‌ ఫీడర్‌ బస్‌‌లు నడుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే మెట్రో ప్రయాణికులకు నెల రోజుల్లో లక్షన్నర స్మార్ట్‌కార్డులు విక్రయించడం జరిగిందని.. ఇది కూడా ఓ రికార్డని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. 

Trending News