'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తోంది. ధనిక, పేద, మధ్యతరగతి, ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ ప్రముఖులైనా, సినీ ప్రముఖులైనా ఎవరికీ తప్పని పరిస్థితి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు కరోనా వైరస్ అంటే గజగజలాడిపోతున్నారు.
కరోనా వైరస్ దెబ్బకు అగ్ర రాజ్యం అమెరికా గజగజా వణుకుతోంది. ఇప్పటికే ట్రావెల్ బ్యాన్ విధించారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. కోవిడ్ 19ను ఎదుర్కునేందుకు అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనను మర్చిపోలేకపోతున్నారు. భారత పర్యటన తన జీవితంలో చెరగని ముద్ర వేసిందని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే భారత్ లో పర్యటించడం చాలా సంతృప్తినిచ్చిందని చెబుతున్నారు.
అదో అద్భుతమైన కట్టడం.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు మరో చిహ్నం. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. పాలరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం.. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకు కారణం. . ఈ ప్రేమ కట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి తిలకించడమే.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం.. అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. . నేడే ముహూర్తం. . మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భారతీయ చలన చిత్ర స్టామినాను.. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి కళాఖండం ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ పేరడీ క్లిప్ .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు రానున్న నేపథ్యంలో వైరల్ గా మారింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి.
మీ ఊళ్లో .. ఎమ్మెల్యే వచ్చినప్పుడు .. లేదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు .. అధికారులు ఏం చేస్తారో గుర్తుందా.. ? అవును .. మీరు ఊహించింది కరెక్టే. ప్రజాప్రతినిధి వస్తున్నప్పుడు దోమలు రాకుండా పౌడర్ చల్లుతారు. రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్ అధికారులు అదే చేస్తున్నారు.
నన్ను భయపెట్టేందుకే ట్రంప్ ఆసియా పర్యటనకు వచ్చాడని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ధ్వజమెత్తాడు. ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఎత్తులు, పైఎత్తులు వేసినా ట్రంప్ ఉత్తర కొరియాను భయపెట్టలేడని అన్నారు. ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన మా అణ్వాయుధాల అభివృద్ధి ఇకపై వేగం పుంజుకుంటాయని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒక సైక్లిస్ట్ మహిళ అదేదారిలో వెళుతున్న కాన్వాయ్ ను చూసి తన మధ్యవేలిని గాల్లోకి ఎత్తి చూపింది. ఈ చిత్రాన్ని న్యూస్ ఏజెన్సీ 'ఏఎఫ్పి' ఫోటోగ్రాఫర్ బ్రెండన్ స్మియాలోవ్ స్కీ తన కెమెరాలో బంధించాడు. ఆ చిత్రం వెంటనే వైరల్ అయ్యింది. అంతలా ఏముందనేగా మీ డౌట్? ఆ కాన్వాయ్ లో వెళుతున్నది అమెరికా అధ్యక్షుడు అందుకే అంత వైరల్. ఈ ఘటన వాషింగ్టన్ లోని గోల్ఫ్ క్లబ్ రహదారిపై జరిగింది.
11 రోజుల ఆసియా పర్యటన యాత్రకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయల్దేరారు. ఆసియా యాత్రలో భాగంగా ఆయన జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. గత 25 ఏళ్లలో ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో 10 రోజులకు పైగా పర్యటించడం ఇదే తొలిసారి. 1991-1992 మధ్య కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ ఆసియా దేశాల్లో సుదీర్ఘంగా పర్యటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.