ట్రంప్ యుద్దాన్ని కోరుకుంటున్నాడు

Last Updated : Nov 12, 2017, 08:38 AM IST
ట్రంప్ యుద్దాన్ని కోరుకుంటున్నాడు

నన్ను భయపెట్టేందుకే ట్రంప్ ఆసియా పర్యటనకు వచ్చాడని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌‌‌ ధ్వజమెత్తాడు. ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఎత్తులు, పైఎత్తులు వేసినా ట్రంప్ ఉత్తర కొరియాను భయపెట్టలేడని అన్నారు. ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన మా అణ్వాయుధాల అభివృద్ధి ఇకపై వేగం పుంజుకుంటాయని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. 

ట్రంప్ ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా శక్తులను కూడగతున్నారు, అందుకే ఆయన ఆసియా పర్యటనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన ఒక విధ్వంసకుడని ట్రంప్ పై కిమ్ మండిపడ్డారు. ట్రంప్ ఉత్తర కొరియాతో యుద్ధాన్ని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పైగా ట్రంప్ ను రెచ్చగొడుతూ ఆయన యుద్ధాన్ని యాచిస్తున్నాడని ఎద్దేవా చేయడం గమనార్హం. అణ్వాయుధాల తయారీ ఆపే ప్రసక్తే లేదని కిమ్ మరోమారు స్పష్టం చేశారు.

Trending News