300 ఏళ్లకు ముహూర్తం.. !!

అదో అద్భుతమైన కట్టడం..  ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు మరో చిహ్నం.  ప్రపంచంలో  7 వింతల్లో ఒకటి. పాలరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం..  ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకు కారణం. . ఈ ప్రేమ కట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి తిలకించడమే.

Last Updated : Feb 25, 2020, 11:40 AM IST
300 ఏళ్లకు ముహూర్తం.. !!

అదో అద్భుతమైన కట్టడం..  ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు మరో చిహ్నం.  ప్రపంచంలో  7 వింతల్లో ఒకటి. పాలరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం..  ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకు కారణం. . ఈ ప్రేమ కట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి తిలకించడమే.

ముంతాజ్ బేగం, షాజహాన్ అందమైన ప్రేమకు చిహ్నంగా నిర్మితమైన తాజ్ మహల్.. కాలక్రమంలో కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీంతో పాలరాతి కట్టడం కాస్త. . రంగు మారుతూ వస్తోంది. ఐతే ఈ పాలరాతి కట్టడాన్ని దాదాపు 300 ఏళ్ల తర్వాత ముహుర్తం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వస్తున్న సందర్భంగా దాన్ని మళ్లీ శుభ్రం చేశారు. క్లే బ్లీచింగ్‌తో తాజ్ అందాలను మళ్లీ పునరుత్తానం చేశారు.  అంతే కాదు ట్రంప్ తాజ్ పర్యటనకు వచ్చినప్పుడు .. యమునా నదిలోనూ దుర్వాసన రాకుండా కొత్త నీటితో నింపేశారు. మరోవైపు ఆగ్రాలోని రోడ్లన్నీ శుభ్రం చేశారు. ఎక్కడ ఎలాంటి చెత్త కనిపించకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్లపై ఉన్న వాటికి రంగులు వేశారు.  

ఐతే తాజ్ మహల్‌ను క్లీన్ చేయడానికి ఫైరింజన్లతో భారీగా నీటిని స్ప్రే చేశారని .. ఓ వీడియె నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కానీ  ఇది నిజం కాదని తేలింది. ఇది మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న తాజ్ మహల్ నకలు కట్టడం. దాన్ని గతంలో శుభ్రం చేసిన వీడియో పెట్టిన నెటిజనులు. .  ట్రంప్ రాక సందర్భంగా తాజ్ మహల్ ను శుభ్రం చేశారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.

Trending News