మొతెరా స్టేడియం లోపలి దృశ్యాలు చూశారా..?

అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం..  అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. .  నేడే ముహూర్తం. .  మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?

Last Updated : Feb 24, 2020, 09:35 AM IST
మొతెరా స్టేడియం లోపలి దృశ్యాలు చూశారా..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో మొతెరా స్టేడియంను నిర్మించారు. మొత్తం 63 ఎకరాల్లో ఈ స్టేడియం నిర్మితమైంది. ప్రపంచ ప్రఖ్యాత స్టేడియంలను తలదన్నేలా దీన్ని నిర్మించారు. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అన్ని హంగులతో పూర్తయిన స్టేడియంను ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీన్ని అగ్ర రాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేడు ప్రారంభించనున్నారు. మొతేరా స్టేడియంలో దీని కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి పూట విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది.

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద స్టేడియంగా నిర్మితమైన మొతేరా స్టేడియంలో ఏకంగా ఒకేసారి లక్ష 10 వేల మంది కూర్చుని మ్యాచ్ చూడవచ్చు. ఈ స్టేడియం ప్రారంభోత్సవానికి నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

'నమస్తే ట్రంప్' కార్యక్రమం సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు స్వాగతం తెలుపుతూ గుజరాత్ ప్రభుత్వం చేసిన ప్రోమోను షేర్ చేశారు.

Read Also: ఆహా.. వారి చేతులు అద్భుతాన్ని చేశాయి.. !!

Trending News