పెద్దన్న రాక కోసం..!!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. 

Last Updated : Feb 22, 2020, 03:51 PM IST
పెద్దన్న రాక కోసం..!!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి.  

గుజరాత్‌లోని అహ్మదాబాద్ అందంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యాధ్యక్షునికి స్వాగత తోరణాలు వెలిశాయి. అహ్మదాబాద్ పట్టణం అంతా ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. అంతర్జాతీయంగా అతి పెద్దదైన మొతెరా స్టేడియంను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం మొతెరా స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. భారత్, అమెరికా భద్రతా బలగాలను  సెక్యూరిటీ ఏర్పాట్లను సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. 

 

అటు ఉత్తరప్రదేశ్ లోని ప్రపంచ అద్భుత ప్రేమ చిహ్నం ఆగ్రాను డోనాల్డ్ ట్రంప్ సందర్శించనున్నారు.  ఇందు కోసం అధికారులు అక్కడ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తాజ్ మహల్ చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.  యమునా నదిలో దుర్వాసన రాకుండా కొత్త నీటిని పంపిస్తున్నారు.  
 
మరోవైపు పంజాబ్ లోని జగ్జీత్ సింగ్ రూబల్ అనే కళాకారుడు డోనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. దీన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఆకట్టుకోనున్న కైలాష్ ఖేర్ ప్రదర్శన

అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన 'జై జై కారా.. స్వామి సాత్ దే హమారా' అనే పాటను ఆయన పాడబోతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో నృత్యం చేయిస్తానని కైలాష్ ఖేర్ చెబుతున్నారు.

 

Trending News