వైరల్ గా మారిన 'ఫోటో'

Last Updated : Nov 7, 2017, 10:34 AM IST
వైరల్ గా మారిన 'ఫోటో'

సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒక సైక్లిస్ట్ మహిళ అదేదారిలో వెళుతున్న కాన్వాయ్ ను చూసి తన మధ్యవేలిని గాల్లోకి ఎత్తి చూపింది. ఈ చిత్రాన్ని న్యూస్ ఏజెన్సీ 'ఏఎఫ్పి' ఫోటోగ్రాఫర్ బ్రెండన్ స్మియాలోవ్ స్కీ తన కెమెరాలో బంధించాడు. ఆ చిత్రం వెంటనే వైరల్ అయ్యింది. అంతలా ఏముందనేగా మీ డౌట్? ఆ కాన్వాయ్ లో వెళుతున్నది అమెరికా అధ్యక్షుడు అందుకే అంత వైరల్. ఈ ఘటన వాషింగ్టన్ లోని గోల్ఫ్ క్లబ్ రహదారిపై జరిగింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కాన్వాయ్ లో వెళుతున్న వేళ, అదే దారిలో సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న ఓ మహిళ,  ట్రంప్ వైఖరిని నిరసిస్తూ, తన మధ్యవేలును గాల్లోకి ఎత్తి చూపించింది. పనులన్నీ వదిలివేసి, ప్రజల గోడు పట్టించుకోకుండా తీరిగ్గా గోల్ఫ్ ఆడేందుకు ట్రంప్ వెళుతున్నాడన్న ఆగ్రహంతో, ఆ మహిళ మధ్యవేలును ఎత్తి చూపి తన నిరసన తెలిపింది. ఆమె డెమొక్రాట్ల మద్దతుదారట. అదే సమయంలో ట్రంప్ కాన్వాయ్ లో వెళుతున్న సన్నివేశాల్ని బ్రెండన్ బంధించాడు. 

"నా పక్క నుంచి అతను వెళుతున్నాడు. నా రక్తం మరగడం ప్రారంభమైంది" అని ఆ 50 ఏళ్ల మహిళ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె  ను ట్రంప్ చూశాడో, చూడలేదో తెలియలేదుగానీ, ఆమె ఉద్యోగం చేస్తున్న కంపెనీ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణించింది. ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. యూఎస్ సోషల్ మీడియా పేజీల్లో ఈ ఫొటోయే ఇప్పుడు వైరల్. 

Trending News