చరఖా యంత్రం తిప్పిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు. 

Last Updated : Feb 24, 2020, 12:57 PM IST
చరఖా యంత్రం తిప్పిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా వారు .. జాతిపిత మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మహాత్మ గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. వారితోపాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. జాతిపిత గురించి ప్రధాని.. ట్రంప్ కు వివరించారు. వారిద్దరూ కలిసి మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేశారు.

చరఖా యంత్రంతో నూలు వడికి.. విదేశీ వస్తువులను బహిష్కరించే ఉద్యమాన్ని ఆనాడు చేపట్టారు గాంధీజీ. స్వదేశీ దుస్తుల తయారీ కోసం చరఖా యంత్రాన్ని ఉపయోగించారు. ఇప్పుడు అదే చరఖా యంత్రాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వడికి చూశారు. అక్కడున్న సిబ్బంది ఆయనకు సహాయం చేశారు. మరోవైపు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఉత్సాహంగా చూశారు.

Trending News