Sun transit 2023: సూర్య, శని గ్రహాల యుతి..మార్చ్ 15 వరకూ ఈ 5 రాశుల జాతకులు ఇక కోటీశ్వరులే

Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నిర్ణీత సమయంలో వివిధ గ్రహాల రాశి పరివర్తనం చెందుతుంటాయి. ఒక్కోసారి రెండు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యుతి ఏర్పరుస్తాయి. అదే విధంగా శని, సూర్య గ్రహాలు కలిసి కుంభరాశిలో యుతి ఏర్పర్చుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2023, 07:59 AM IST
Sun transit 2023: సూర్య, శని గ్రహాల యుతి..మార్చ్ 15 వరకూ ఈ 5 రాశుల జాతకులు ఇక కోటీశ్వరులే

శని, సూర్య గ్రహాల యుతి కొన్ని రాశులకు అద్భుత ప్రయోజనంగా మారుతుంది. కొన్ని రాశులపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం కల్గిస్తుంది. కుంభరాశిలో సూర్యుడి ప్రవేశంతో ఏయే రాశులకు శుభ సూచకమో తెలుసుకుందాం..

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశిలో సూర్యుడి గోచారమైంది. మార్చ్ 15 వరకూ అంటే మరో 26 రోజులు సూర్యుడు కుంభరాశిలోనే కొలువు దీరనున్నాడు. మరోవైపు శనిగ్రహం ముందు నుంచే కుంభంలో ఉన్నాడు. ఈ గోచారంతో రెండు గ్రహలు ఎదురెదురౌతాయి. శని, సూర్య గ్రహాల యుతి కొన్ని రాశులకు శుభంగా, కొన్ని రాశులకు ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. ఏయే గ్రహాలకు లాభం కలగనుందో పరిశీలిద్దాం..

మేషరాశి

సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించడం ఈ రాశివారికి చాలా లాభం చేకూర్చనుంది. ఈ సమయంలో మీలో దాగున్న టాలెంట్ బయటపడుతుంది. ఆర్ధికంగా సూర్యుడి ఈ గోచారానికి చాలా ప్రాధాన్యత ఉంది. డబ్బుతో ముడిపడి ఉండే చాలా సమస్యలు దూరమౌతాయి. సామాజికపరంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలుంటాయి.

వృషభ రాశి

వృషభరాశి 10వ పాదంలో సూర్యుడి గోచారం కారణంగా బలమైన స్థితిలో ఉంటాడు. ఫలితంగా కెరీర్‌లో ముందుకు రాణించేందుకు అవకాశముంటుంది. వృత్తి రీత్యా అధికారాలు, బాధ్యతలు పెరుగుతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. దాంతోపాటు ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. 

మిధున రాశి

సూర్యుడి గోచారం మిథునరాశి 9వ పాదంలో ఉంటుంది. ఫలితంగా మీరు పడిన కష్టానికి పూర్తి ప్రతిఫలం ఉంటుంది. శని,సూర్య గ్రహాల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అదృష్టం తోడవుతుంది. కష్టం నుంచి వెనుకాడకూడదు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. దాంతోపాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది.

సింహ రాశి

సూర్యుడి గోచారం ఈ రాశి 7వ పాదంలో ఉంటుంది. ఈ సమయంలో మీరు మరింతగా కష్టపడాల్సి వస్తుంది. ఆర్దిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగౌతుంది. సూర్యుడి తదేక దృష్టి ఈ రాశిపై ఉంటుంది. అందుకే ఈ సమయంలో చాలా యాక్టివ్ గా ఉంటారు. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. కొత్త వ్యాపారం చేయవచ్చు.

తుల రాశి

ఈ రాశిలో సూర్యుడు ఏకాదశ పాదంలో ఉంటాడు. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన సంపదలు లభిస్తాయి. ఆదాయం కోసం పలు మార్గాలు తెర్చుకుంటాయి. మిమ్మల్ని మీరు మరింత శక్తివంతులుగా మార్చుకోగలరు. ఉద్యోగం మారాలనుకుంటే..ఇది మంచి సమయం.

Also read: Aghoris Dark Secrets: అఘోరీల చీకటి జీవితం ఇదే, శవాలు తినడం, మృతదేహాలతో కోర్కెలు తీర్చుకోవడం చూస్తే మతులు పోవల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News