Sun Transit 2023: ఏడాది తరువాత మిథునంలోకి సుర్యుడు.. 4 రాశులకు మహర్దశ ప్రారంభం

Sun Transit 2023 in Gemini: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించడాన్నే గ్రహ గోచారంగా పిలుస్తారు. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. ఈ క్రమంలో సూర్యుడి గోచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2023, 05:41 PM IST
Sun Transit 2023: ఏడాది తరువాత మిథునంలోకి సుర్యుడు.. 4 రాశులకు మహర్దశ ప్రారంభం

Sun Transit 2023 in Gemini: హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రారాజుగా పరిగణిస్తారు. సూర్యుడి గోచారం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా.. ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది. సూర్యుడి త్వరలో మిధునరాశిలో ప్రవేశించనుండటం ఆ రాశులకు అత్యంత శుభప్రదం కానుంది.

సూర్యుడు మరో పదిహేను రోజుల్లో అంటే జూన్ 15న మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. సరిగ్గా ఏడాది తరువాత తిరిగి సూర్యుడి మిధున రాశి ప్రవేశం జరుగుతోంది. ఫలితంగా 4 రాశులకు 32 రోజుల వరకూ తిరుగుండదు. అంతులేని ధన సంపదలు వచ్చి పడతాయి. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా..ఈ 4 రాశులపై మాత్రం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15వ తేదీ సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. జూలై 17 వరకూ ఇదే రాశిలో సూర్యుడు ఉండటం వల్ల అంటే 32 రోజుల వరకూ ముఖ్యంగా 4 రాశులవారికి మహర్దశ పట్టనుంది. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడి మిధున రాశి ప్రవేశం వల్ల 4 రాశులకు అదృష్టం తోడుగా ఉంటుంది. ప్రతి రంగంలో విజయం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలుంటాయి.

సూర్యుడి మిధున రాశిలో ప్రవేశించడం వల్ల సింహ రాశి జాతకులు ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు అనువైన సమయం. ఆదాయ మార్గాలు పెరగడంతో ధన సంపద వచ్చి పడుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధిత  వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది రావచ్చు.

Also Read: Astrology: నవపంచం రాజయోగంతో ఈ 4 రాశులకు మహార్దశ.. వీరు పట్టిందల్లా బంగారమే...

మేష రాశి జాతకులపై సూర్యుడి మిధున రాశి ప్రవేశం ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఇంట్లో శుభకార్యం జరగవచ్చు. మీ వ్యాపారం మరింత పెరిగి ఊహించని లాభాలు కురిపిస్తుంది. క్రీడారంగంలో ఉండేవారికి శుభవార్త లభించవచ్చు. ఉద్యోగులకు అనువైన సమయం. ఆర్ధికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా కాస్త అప్రమత్తత అవసరం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

సూర్యుడి గోచారం ప్రభావంతో కుంభ రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారం విస్తృతమై ఆర్ధికంగా లాభపడతారు. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి సమయం. ఈ రాశి జాతకులకు ఆర్ధికంగా పటిష్టమైన స్థితి కలిగి ఉంటుంది. 

కన్యారాశి జాతకులకు 32 రోజుల వరకూ ఊహించని ధనలాభం కలగనుంది. ఇంట్లో కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. జూన్ 15 నుంచి జూలై 17 వరకూ ఉద్యోగ, వ్యాపారులకు తిరుగుండదు. తోటి ఉద్యోగులు లేదా ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. ఉద్యోగం మారాలనుకుంటే కొత్త అవకాశాలు కలుగుతాయి. 

Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News