Whatsapp: వాట్సప్ పంపిస్తాను..వాట్సప్ చెక్ చేశావా..వాట్సప్‌లో వచ్చింది..అంతా వాట్సప్ మయం. వాట్సప్ మన ప్రపంచాన్ని అంతగా మార్చేసింది. గతంలో మొబైల్ ఫోన్ లేకపోతే ఊహించడం ఎలా కష్టమో..ఇప్పుడు వాట్సప్ లేకపోతే ఊహించడం కూడా కష్టమే. అసలీ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారా..రీడ్ ద స్టోరీ
కేంద్ర ప్రభుత్వం ( Central government)తాజాగా అంటే ఫిబ్రవరి 25న డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ( Digital media ethics code)పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 ( Information technology 2021) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధనలు అమలైతే ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ( Social media messaging app whatsapp)కు చిక్కులు తప్పేట్టు లేదు. అంటే ఏం కానుంది. కొంపతీసి బ్యాన్ కావచ్చా అంటే అలా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వివాదాస్పద మెస్సేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలుసుకునేందుకు మూలాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్ని వాట్సప్, సిగ్నల్, టెలీగ్రామ్ వంటి మెస్సేజింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వాటిపై వేటు తప్పదు.
మెస్సేజ్‌లకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ( End to end encryption)ఉందని చెబుతున్న వాట్సప్, సిగ్నల్, టెలీగ్రామ్ వంటి సంస్థలకు కొత్త నిబంధనలు తలనొప్పిగా మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం వివాదాస్పద మెసేజ్ ముందుగా ఎవరి నుంచి వచ్చిందనేది కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా ఒక ట్వీట్ లేదా మెస్సేజ్ భారతదేశం నుంచి పోస్ట్ కాలేదని వెల్లడైతే..ముందుగా ఎవరు దాన్ని రిసీవ్ చేసుకున్నారో యాప్ సంస్థ వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో ఇలాగే ఓ మెస్సేజ్ మూలాల్ని వెల్లడించాలని ప్రభుత్వం కోరినప్పుడు అది తమ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత విధానానికి విరుద్ధమని నిరాకరించిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొత్త ఐటీ నిబంధనలు( New it rules)అమలైతే విధిగా ప్రభుత్వం అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగని సమర్పించే వాట్సప్ ( whatsapp) వినియోగదారుల నుంచి ప్రతికూలత ఎదురు కానుంది. కొత్త ఐటీ నిబంధనల మేరకు వివరాలు సమర్పిస్తే యూజర్లు దూరమవుతారు. వాట్సప్ ఆదరణ తగ్గుతుంది. అలాగని ఐటీ నిబంధనల్ని కాదని వివరాలు సమర్పించకపోతే వాట్సప్ వంటి మెస్సేజింగ్ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి.
సో..ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా సరే వాట్సప్‌కు నష్టమే ఎక్కువ సంభవించేలా కన్పిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వాట్సప్‌కు ఇప్పుడు ముందు గొయ్యి..వెనుక నుయ్యి పరిస్థితి ఎదురైంది. రెండు ప్రతికూలతల్ని ఎదుర్కొని వాట్సప్ ఎలా నెట్టుకొస్తుందనేది చూడాలి.
Also read: New rules for social media, digital, OTT: ఓటిటి, సోషల్ మీడియా, డిజిటల్‌కి కొత్త రూల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook