Money Hunting Challenge: సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్.. లైక్‌లు.. వ్యూయర్స్ పెంచుకోవాలనే పనిలో కొందరు విచిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ కోసం రోడ్డుపై రూ.పాతిక వేలు పారవేశాడు. ఎవరైనా వెళ్లి తెచ్చుకోవాలని సూచించాడు. ఇలా రోడ్డు మీద పడేసిన డబ్బుల కోసం నెటిజన్లు విపరీతంగా చూస్తారని భావించిన ఆ యువకుడు వీడియోలు చేశాడు. అయితే అతడి వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు.
Also Read: Sabarimala: శబరిమల క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఆత్మహత్య.. విచారణలో సంచలన విషయాలు
చందూ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ మనీ హంటింగ్ ఛాలెంజ్ (డబ్బు కోసం వేట) అనే పేరిట డబ్బులు వెదజల్లుతున్నాడు. అతడి ఇన్‌స్టా ఐడీ chandu_rockzz_003. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 9 వద్ద చందూ నోట్ల కట్టతో ప్రత్యక్షమయ్యాడు. 'మీ కోసం మనీ హంటింగ్ ఛాలెంజ్ చేస్తున్నా. రూ.25,000 మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకోసమే. అక్కడ డబ్బులు వేశా వెళ్లి తీసుకోండి' అంటూ చందూ రీల్ చేశాడు.
Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం
అతడు చేసిన పనికి ఊహించని స్పందన లభించింది. ఇప్పటికే 3.8 మిలియన్ల వ్యూస్ రాగా.. దాదాపు లక్ష వరకు కామెంట్లు వచ్చాయి. కొందరు అదంతా ఫేక్ బ్రో అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు వ్యూస్ కోసం ఏమైనా చేస్తారు అని చెబుతున్నారు. మీరు వేసే డబ్బులు అసలువి కాదు నకిలీవి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ వీడియో చూసిన చందూ షేక్స్ అనే ఓ నెటిజన్ 'ఎక్స్' వేదికగా రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కమిషనర్ స్పందన
'120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఓఆర్ఆర్ వద్ద ఇలాంటి పని చేయడంతో ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇతడిపై చర్యలు తీసుకోవాలి' అని చందూ షేక్స్ విజ్ఞప్తి చేశాడు. రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను ట్యాగ్ చేశాడు. అతడి విజ్ఞప్తిని చూసిన రాచకొండ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఘట్కేసర్ పోలీసులు చర్యలు తీసుకోవాలని.. అతడిపై కేసు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Dear @TelanganaDGP please look into this video , this person for the sake of content creation doing such reckless videos on ORR where the Maximum speed is 120km/Hr , if any individuals involve in this “money hunting” it might cause accidents or harmful experiences on ORR.… pic.twitter.com/o8BfAhv07r
— Chandu Sheks (@ChanduSheksBRS) December 16, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.